Jagan: సాధారణంగా ఎవరైనా తమ అభిరుచికి తగ్గట్టు ఇల్లు కట్టుకుంటారు. తమ స్తోమతకు తగ్గట్టు నిర్మించుకుంటారు. భద్రత కావాల్సిన వారు కొంచెం దానికి పెద్ద పీట వేస్తారు. అయితే మనస్తత్వానికి తగ్గట్టు ఇంటి నిర్మాణం ఉంటుందంటారు పెద్దలు. అయితే ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఏమనుకోవాలి? ఆయనకు ప్రధాన నగరాల్లో భారీ భవంతులు ఉన్నాయి. బెంగళూరులో యలహంక ప్యాలెస్ ఉంది. హైదరాబాదులో లోటస్ ఫండ్ ఉంది. తాడేపల్లి లో ఏకంగా రెండెకరాల విస్తీర్ణంలో ఒక ప్యాలెస్ ని నిర్మించారు. రాజకీయ నాయకులు, ఆపై స్వతహాగా సొమ్మున్న వారు కావడంతో వాళ్లు భవనాలు కట్టుకోవడంలో ఎంత మాత్రం తప్పులేదు. అయితే తాడేపల్లి జగన్ ప్యాలెస్ వద్ద 3 అడుగుల ఎత్తులో ఇనుప కంచె కట్టడం మాత్రం విస్తు గొలుపుతోంది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన క్రమంలో ఆయన తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ధనం దాదాపు 12 కోట్ల రూపాయలతో ఈ ఇనుప కంచె వేసుకున్నట్లు తెలుస్తోంది.
* ఎటువంటి అపాయం లేకపోయినా..
జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )తన రక్షణ కోసం, తన భద్రత కోసం ఈ ఇనుప కంచెను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆయన నక్సలైట్ల హిట్ లిస్టులో లేరు. ఏపీలో తీవ్రవాదులు లేరు. ఉంటే గింటే ఫ్యాక్షన్ రాజకీయం ఉంది. రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదం కూడా లేదు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత భారీ కంచె ఏర్పాటు చేసుకున్నట్లు అంటే మాత్రం.. తాను అందరికంటే అతీతమైన వ్యక్తినని.. తాను ఒక అద్భుతమైన వ్యక్తి అని ఒక భ్రమతో ఉంటారు. దాని చుట్టూ ఆలోచన చేస్తారు. తాను ఆ ప్యాలెస్ నుంచి పాలన సాగిస్తానని.. తన మాటకు ఎదురు లేదని భావిస్తారు జగన్మోహన్ రెడ్డి. అంతేతప్ప తన ప్రత్యర్థుల నుంచి దాడులు పొంచి ఉన్నాయో అనో.. లేకుంటే మరో భయంతోనో అన్నది మాత్రం కాదు. కేవలం అందరిలో తాను ఒక్కడిని కాదని చెప్పేందుకే 30 అడుగుల ఇనుప కంచె అని స్పష్టమవుతోంది.
– మాఫియా డాన్ల ఆలోచన ఇది…
సాధారణంగా మాఫియా డాన్లు( Mafia dans) ఈ తరహాలో ఆలోచన చేస్తారు. గతంలో ఓ దేశంలో ఓ మాఫియా డాన్ ఇలానే భారీ భవన్ కి ఇనుప కంచెలు వేశారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. ఎక్కడ తల దాచుకున్నా ఇటువంటి నిర్మాణాలనే చేసుకున్నారు. అటువంటి ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి దిగడం కూడా గమనించదగ్గ విషయం. ప్రజలతో మమేకం అనేది కేవలం రాజకీయ స్టంట్. కానీ ఆ ప్రజల్లో తాను ఒక్కడినని ఆయన భావించరు. అది ఆయన విపరీతమైన లక్షణం. అందుకే తనకు, ప్రజలకు మధ్య 30 అడుగుల కంచెతో విభజన రేఖ గీసుకున్నారు.