Homeఎంటర్టైన్మెంట్Box Office: ఈ వారం ఏకంగా 8 సినిమాలు !

Box Office: ఈ వారం ఏకంగా 8 సినిమాలు !

Box Office: సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా ? ఇది అఖండ సినిమా రిలీజ్ కి ముందువరకు ఉన్న అనుమానం. నిజానికి అఖండ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బయ్యర్లు కూడా ఈ విషయంలో చాలా టెన్షన్ పడ్డారు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అఖండ రిలీజ్ అయి అఖండ విజయం సాధించి.. నిజంగానే సినిమా పరిశ్రమకి ఊపిరి పోసిందనే చెప్పాలి.

ఆ ఊపిరితో ఇప్పుడు విడుదలకి చాలా సినిమాలు సిద్దంగా ఉన్నాయి. దాంతో ఈ డిసెంబ‌రు అంతా కొత్త సినిమాల‌తో తెలుగు చిత్రసీమ క‌ళ‌క‌ళ‌లాడిపోబోతుంది. కానీ అఖండ‌ ఇచ్చిన బూస్ట‌ప్.. చిన్న సినిమాలకు ఎంతవరకు పనికొస్తోంది అనేదే డౌట్. ఎలాగూ డిసెంబ‌రు 17న పుష్ఫ రాబోతుంది. ఆ త‌ర‌వాత వారం నాని హీరోగా వస్తోన్న శ్యాం సింగ‌రాయ్ సినిమా ఉంది.

box office 8 movies this week
Allu Arjun Pan India Film Pushpa The Rise

ఆ వెంట‌నే సంక్రాంతి సీజ‌న్ మొద‌లవుతుంది. ఇక భారీ చిత్రాలు పోటీ పడతాయి. కాబట్టి డిసెంబర్ 17వ తేదీ తర్వాత ఇక చిన్న సినిమాల రిలీజ్ కి డేట్ లేదు. కాబట్టి… ఈ సెకెండ్ వీకే మంచి అవకాశం. అందుకే ఈ వారం ఏకంగా 8 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పేరుకి 8 సినిమాలు రిలీజ్ అవుతున్నా.. తెలిసిన సినిమాలు మాత్రం ల‌క్ష్య‌, గ‌మ‌నం మాత్రమే.

Gamanam Movie

నాగ‌శౌర్య హీరోగా రాబోతున్న లక్ష్య‌ సినిమా పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. పైగా ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాతో ఉంటుంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆక‌ట్టుకునేలా ఉన్నా.. వ్యూస్ ను మాత్రం తెచ్చుకోలేకపోయాయి. అయితే, నాగశౌర్య మాత్రం ఈ సినిమా కోసం 8 ప్యాక్ బాడీ పెంచాడు. మాస్ ని త‌న వైపుకు లాగేసుకోవాడనికి బాగా కష్టపడ్డాడు.

Naga Shaurya Sports Drama Lakshya Movie

కానీ, ఈ సినిమా చూసి శౌర్య ఇమేజ్ మారుతుందని అనుకోలేం. అయినా ఒక హీరోకి పైగా చిన్న హీరోకి మాస్ ట‌చ్‌ రావాలి అంటే.. భారీ హిట్ ఉండాలి. శౌర్య కెరీర్ లో ఆ రేంజ్ హిట్ ఇంతవరకు పడలేదు. కాబట్టి, ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం లేదు. ఇక శ్రియ ప్ర‌ధాన పాత్రలో వస్తోన్న గమనం సినిమా పై మాత్రం క్లాస్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

Also Read: ‘పుష్ప’ షూట్ లో యూనిట్ కు సంచలన ఆదేశాలు ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో వైరల్

పైగా ఈ సినిమాకి మంచి సాంకేతిక వర్గం పని చేసింది. ఇక ఈ వారం వ‌చ్చే మిగిలిన సినిమాల విషయానికి వస్తే.. మ‌డ్డీ, న‌యీం డైరీస్‌,చ బుల్లెట్ స‌త్యం, క‌టారి కృష్ణ‌, మ‌న‌వూరి పాండ‌వులు, ప్రియ‌త‌మా చిత్రాలు రాబోతున్నాయి. వీటి భవిష్యత్తు గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు.

Also Read: నాగశౌర్య “లక్ష్య” సినిమా ట్రైలర్ రిలీజ్… ఈసారి సక్సెస్ ఏ గురి

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version