Adani Bought NDTV: ఎన్డీటీవీ.. జాతీయ స్థాయిలో మంచి పేరు, పరపతి ఉన్న అగ్ర మీడియా సంస్థ. ఓ వర్గానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తుందన్న టాక్ ఉంది. ఇలాంటి అగ్రమీడియాను మోడీకి స్నేహితుడు.. ప్రపంచంలోనే టాప్ 4 ధనవంతుడు గౌతం అదానీ కొనేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్డీటీవీలోని 29 శాతం వాటాను చేజిక్కించుకొని మిగతా 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ఇవ్వడం అందరినీ విస్మయపరిచింది. కానీ ఇదంతా ఎన్డీటీవీకి తెలియకుండానే జరిగిందని.. అనైతికంగా.. ఆ కంపెనీలోని 29 శాతం వాటా ఉన్న వారి నుంచి అదానీ గ్రూపు చేజిక్కించుకుందని ఎన్డీటీవీ ఆరోపిస్తోంది. శత్రుస్వాధీనం చేసుకున్నట్టు ఆరోపించింది. తమకు నోటీసులు ఇవ్వకుండా.. తెలియజేయకుండా తమ షేర్లు ఎలా కొంటారని ఎన్డీటీవీ ప్రశ్నిస్తోంది. ఇప్పుడీ వివాదం జాతీయ వ్యాపారవర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఎన్డీటీవీని గౌతం అదానీ కొనడం వెనుక పెద్ద కథనే ఉందని అంటున్నారు. అసలా కథేంటి? దాని వెనుక ఏం జరిగిందన్నది తెలుసుకుందాం..
తమ షేర్లను అనైతికంగా గౌతం అదానీ కొనేశాడని ఎన్టీటీవీ గగ్గోలు పెడుతున్నాయి. కానీ దీనివెనుక పెద్ద తతంగమే ఉందని ఢిల్లీ మీడియా సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ సాగుతోంది. దేశంలోని టాప్ అగ్ర జాతీయ మీడియాలన్నింటిలోనూ విదేశీ క్రైస్తవ మిషనరీల నుంచి నిధులు అందాయన్న గుసగుసలు ఉన్నాయి. విదేశీ అగ్రసంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టి దేశ రాజకీయాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్లాన్లు చేశాయి. ఈ క్రమంలోనే ఎన్డీటీవీ కూడా ఫక్తు హిందుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తన చానెల్ లో చేస్తుందన్న ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. హిందుత్వ వాదాన్నే ఈ చానెల్ సహించదన్న టాక్ ఉంది. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ జాతీయ చానెళ్లను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా.. విదేశాల నుంచి వీరికి ఆర్థికంగా మంచి అండదండలు ఉండడంతో సాధ్యం కాలేదు.
ఇప్పుడు మోడీ సర్కార్ వచ్చాక విదేశీ హిందూ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా సొంతంగా మీడియాను డెవలప్ చేశారు. ఈక్రమంలోనే రిపబ్లిక్ చానెల్ లాంటి బీజేపీ అనుకూల మీడియాలు పుట్టుకొచ్చాయి. మన నిజమైన వార్తలను ప్రసారం చేస్తున్నాయి. అయితే ఈ హిందూ వ్యతిరేక చానెళ్లను కూడా దారికి తేవాలని ఎప్పటి నుంచో మోడీ బ్యాచ్ కాచుకూర్చుంది. ఇప్పటికే ట్విట్టర్ లాంటి సంస్థలకు నిబంధనలు మార్చి షాకిచ్చింది. తాజాగా ఎన్డీటీవీలోనూ హిందుత్వ వ్యతిరేక పోకడలు.. దేశంలో హిందూ మతానికి వ్యతిరేకంగా గళం విప్పడాన్ని బీజేపీ నిశితంగా గమనించింది. అందుకే ఇందులోని మైనార్టీ వాటా దారులు కూడా దీనికి సహకరించినట్టు తెలుస్తోంది. ఎన్డీటీవీలో 29శాతం వాటా ఉన్న కంపెనీ తాజాగా గౌతం అదానీకి తన షేర్లు అమ్మేసింది. దీంతో గౌతం అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో మరో 26శాతం వాటా కొనేందుకు రెడీ అయ్యింది. ఈ పరిణామంతో తము స్వతంత్ర్యంగా ఏదైనా చేయవచ్చని ఇన్నాళ్లు విదేశీ శక్తులతో విర్రవీగిన ఎన్డీటీవీ ఆట కట్టైనట్టైంది. అందుకే గౌతం అదానీ అనైతికంగా కొన్నాడని ఇప్పుడా చానెల్ ముసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ వాదులు అంటున్నారు. హిందూ వ్యతిరేక భావజాలం వ్యాపింప చేస్తున్న ఎన్డీటీవీకి అదానీ, బీజేపీ తగిన శాస్తి చేసిందని మీడియా సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.
విస్తరణ ప్రణాళికలో భాగంగా మీడియా పెట్టుబడులను పెంచేందుకు గౌతం అదానీ ఎప్పటి నుంచో కాచుకు కూర్చున్నారు. దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వార్తా ఛానెల్లలో ఒకటైన ఎన్డీటీవీ (న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు నిన్ననే దేశంలోనే ధనిక భారతీయుడు గౌతమ్ అదానీ గ్రూప్ తెలిపింది.
Also Read: Rajasingh- Lawyer Karuna Sagar: రాజాసింగ్ తరుఫు న్యాయవాది సాగర్ సంచలన వ్యాఖ్యలు
ఇంతలో ఎన్డీటీవీ ఒక ప్రకటన విడుదల చేసి షాకిచ్చింది. “న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (NDTV) లేదా దాని వ్యవస్థాపక-ప్రమోటర్లతో ఎటువంటి చర్చ లేకుండానే.. విశ్వప్రదన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) ద్వారా అనైతికంగా తమ షేర్లను గౌతం అదానీ గ్రూపు కొనేసింది’ అని ఆరోపించింది. VCPL గ్రూప్ NDTVలో 29.18% వాటా కలిగి ఉందని.. వారి నుంచి అదానీ తమకు చెప్పకుండా తమ ఎన్డీటీవీ కంపెనీ షేర్లు కొనడం అనైతికమని విమర్శించింది. సోమవారం వరకు NDTV దాని ప్రమోటర్లు కంపెనీలో తమ వాటాలను విక్రయించడానికి చర్చలు జరపలేదని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (NDTV)తోపాటు దాని వ్యవస్థాపక-ప్రమోటర్లతో ఎలాంటి చర్చ లేకుండానే NDTVలో 29.18% వాటాను కలిగి ఉన్న ప్రమోటర్ యాజమాన్యంలోని కంపెనీ విశ్వప్రదన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) ద్వారా గౌతం అదానీ తమ కంపెనీ షేర్లు కొనేశాడని.. దీనికి గాను VCPLకు ఎన్డీటీవీ తాజాగా నోటీసు పంపించింది. NDTV వ్యవస్థాపకుల నుండి ఎటువంటి ఇన్పుట్, సంభాషణ లేదా సమ్మతి లేకుండా VCPL ద్వారా ఈ షేర్ల బదలాయింపు అనైతికమని కంపెనీ ఆరోపించింది.. నిన్న మొన్నటి వరకు NDTV తన వ్యవస్థాపకుల వాటాలో ఎటువంటి మార్పు లేదని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.
ఇక గౌతం అదానీ గ్రూపు ఎన్డీటీవీలో 29శాతం షేర్ కొన్నాక.. NDTV యొక్క ఓటింగ్ షేర్ క్యాపిటల్లో 26% వరకు ఒక్కో షేరుకు ₹294 చొప్పున (16,762,530 వరకు పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లు) కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీన్ని ఎన్డీటీవీ తాజాగా తిరస్కరించింది.
గతంలో ప్రత్యర్థి బిలియనీర్ ముఖేష్ అంబానీతో ముడిపడి ఉన్న కంపెనీని అదానీ గ్రూప్ సంస్థ మొదట కొనుగోలు చేసింది. ఈ నిర్దిష్ట కంపెనీ 2008-09లో NDTVకి రూ. 250 కోట్ల రుణం ఇచ్చింది. అదానీ గ్రూప్ సంస్థ ఇప్పుడు ఆ రుణాన్ని ఎన్డీటీవీ న్యూస్ ఛానెల్ కంపెనీలో 29.18 శాతం వాటాగా మార్చుకుంది. ఇదే ఇప్పుడు వివాదమైంది. ఎన్డీటీవీకి తెలియకుండానే అప్పులిచ్చిన సంస్థకు ఉన్న షేర్లను గౌతం అదానీ బదాలయించుకోవడమే వివాదంగా మారింది. దీన్ని ఎన్డీటీవీ ఖండిస్తోంది.
నిజానికి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మీడియాలన్నింటిని నయానో భయానో తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ స్కెచ్ గీసింది. బలంగా వాయిస్ వినిపించే వాటిని కొనేయడమో.. అందులోకి అనైతికంగా దూరి తమ వశం చేసుకోవడమో చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీటీవీలోనూ ఇలాంటి ప్రయోగాన్ని బీజేపీ చేసిందని.. దీనివెనుక గౌతం అదానీ ఉన్నాడన్న టాక్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్డీటీవీ తాజాగా తమ కంపెనీ షేర్లను అదానీ అనైతికంగా కొనేశాడని అనడంతో వివాదం రాజుకుంది. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందన్నది వేచిచూడాలి.
Also Read:Kaleshwaram Project Debts: కేసీఆర్ కు బిగిస్తున్న ‘కాళేశ్వరం’ ఉచ్చు?
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Adani bought shares without telling ndtv what is the real story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com