Arjun Sarja: సౌత్ చిత్రసీమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్టార్ హీరో అర్జున్ మాతృ మూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు పరమపాదించారు. మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు.
ఐతే, బెంగళూరు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆమె నేడు కన్నుమూశారు. ఆమె తుదిశ్వాస విడవడం కుటుంబాన్ని, అర్జున్ సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది. తల్లిని పోగొట్టుకున్న అర్జున్ కి పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి పరామర్శిస్తున్నారు.
Also Read: Rama Rao On Duty Pre-Release Business: రవితేజ ‘రామారావు’ బిజినెస్ లెక్కలివే.. మాస్ మహారాజ్ భీభత్సం !
అర్జున్ విజయ గమనంలో ఆయన తల్లి లక్ష్మీ దేవమ్మ పాత్ర చాలా కీలకమైనది. సోషల్ మీడియా వేదికగా అర్జున్ కుటుంబ సభ్యులకు అభిమానులు, సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అదేంటో గాని.. ఈ 2022 చిత్ర పరిశ్రమకు అసలు కలిసి రావడం లేదు. కరోనా కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆ మధ్య మహేష్ బాబు అన్న రమేష్ బాబు, కందికొండ, దర్శకుడు శరత్ కూడా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఇప్పుడు అర్జున్ తల్లి గారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమైన విషయం.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున అర్జున్ తల్లి ‘లక్ష్మీ దేవమ్మగారి’ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read:NTR- Sridevi: శ్రీదేవి జీవితంలో ఎన్టీఆర్ చెప్పిందే జరిగింది.. ఇంతకీ ఏమిటో తెలుసా అది ?
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Action king arjuns mother passed away arjuns family is saddened
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com