Corona Vaccine: దేశంలో కొవిడ్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 100 కోట్లకు పైగా డోసులు వేసినట్టు కేంద్రం ప్రకటించింది. నేటికీ కొందరు టీకాలు వేసుకునేందుకు జంకుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వారి భయం. కానీ జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం కొవిడ్ టీకా నిజంగానే అద్భుతం క్రియేట్ చేసింది. పెరాలసిస్ వచ్చి మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి శరీరంలో కదలికలు తీసుకొచ్చింది. చాలా ఏళ్లుగా మాట్లాడకుండా మూగబోయిన గొంతు నుంచి మాటలు రావడంతో కుటుంబసభ్యులు షాక్ అవుతున్నారు. ఈ మిరాకిల్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే జరిగిందని స్థానికంగా అంతా నమ్ముతున్నారు. వైద్యులు కూడా షాక్ అవుతున్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లా పెతర్వార్ మండలం సల్గాడి గ్రామానికి చెందిన 55 ఏళ్ల దులార్‌చంద్ ముండా ఐదేళ్ల కిందట రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో వైద్యులు సర్జరీ చేసి ప్రాణాలను రక్షించారు. అయితే, కొన్ని రోజులకే అతడికి పెరాలసిస్ వచ్చి మంచానికే పరిమితం అయ్యాడు. ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు.
Also Read: వద్దంటూనే ఆ బాధ్యతను మోస్తున్న మెగాస్టార్.. ఇండస్ట్రీకి పెద్దన్నగా మారిపోయారా..?
ఎటూ కదల్లేక నోరు తెరిచి తన బాధను చెప్పలేక ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ డ్రైవ్ నేపథ్యంలో కుటుంబసభ్యులు దులార్ చంద్‌కు కూడా కరోనా టీకా వేయించారు. అంగన్వాడీ కార్యకర్తలు ఇంటికి వచ్చి కోవిషీల్ట్ టీకా వేశారు. అనంతరం ఏం జరిగిందో తెలీదు కానీ టీకా అతనికి సంజీవనిలా పనిచేసింది. శరీరంలో కదలికలతో పాటు నోటి నుంచి మాట కూడా వచ్చింది.
దులార్ చంద్ మాట్లాడటం చూసి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. కరోనా టీకా నిజంగానే అద్భుతం చేసిందని బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ సుమిత్రా దేవి ఈ విషయాన్ని స్వయంగా పేర్కొన్నారు. జనవరి 4న దులార్‌చంద్‌కు అంగన్వాడీ కేంద్ర సిబ్బంది తన ఇంటి వద్దే వ్యాక్సిన్ వేశారని.. ఆ మరుసటి రోజు నుంచి అతడి శరీరంలో మార్పులను గమనించామని స్పష్టం చేశారు. చచ్చుబడిపోయిన అవయవాల్లో కదలికలు రావడం మాములు విషయం కాదని, అతను ఇప్పుడు సాధారణ మనిషిలాగా కోలుకున్నాడని వివరించారు. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయినట్టు సివిల్ సర్జన్ డాక్టర్ జితేంద్ర కుమార్ తెలిపారు. ఈ కేసుపై అధ్యయనం జరపాల్సి ఉందని వెల్లడించారు.
Also Read: ఆ డెరెక్టర్ వైవాహిక జీవితంలో చిచ్చుపెట్టిన ప్రముఖ హీరోయిన్..!
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: A person who has been confined to bed for years camel movements and words after being vaccinated
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com