The Paradise Movie Update: నేచురల్ స్టార్ నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న నాని వేరే లెవెల్ కి వెళ్ళేందుకు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ కి ఆడియన్స్ నుండి బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ ఎవ్వరూ ఊహించనంత రేంజ్ కి చేరింది. ఎప్పుడు విడుదలైనా ఒక స్టార్ హీరో సూపర్ హిట్ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్ వస్తుందో , అలాంటి ఓపెనింగ్ ఈ చిత్రానికి కచ్చితంగా వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు సైతం చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం రిపీట్ గా విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ ఉండడం వల్ల, మార్కెట్ లో బజ్ చిన్నగా తగ్గిపోతూ వస్తోంది.
ముందుగా మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు , ఆ తర్వాత ఆగస్టు 21 కి వాయిదా వేశారు , ఇప్పుడు ఆ తేదీలో కూడా వచ్చే పరిస్థితులు లేకపోవడం తో , సెప్టెంబర్ 25 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నారట. అది కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒత్తిడి చేయడం వల్లే, ఆ తేదీన రావాలని అనుకుంటున్నారని , కానీ అప్పటికీ కూడా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు లేవని ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతున్న చర్చ. ఇలాంటి రూమర్స్ వచ్చిఅప్పుడల్లా ప్యారడైజ్ టీం సోషల్ మీడియా లో రెస్పాన్స్ ఇస్తూ , అలాంటివేమీ లేదని , షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుందని , ఆగస్టు 21 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామంటూ చెప్పుకొచ్చేది. కానీ ఇప్పుడు మూవీ టీం నుండి చప్పుడు లేదు. రీసెంట్ గా వాళ్ళు మీడియా కి ఒక సమాచారం అందించారట.
ఈ సినిమా షూటింగ్ 80 శాతం వరకు పూర్తి అయ్యిందని , బ్యాలన్స్ 20 శాతం షూట్ తో పాటు, పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందని చెప్పారట. కానీ అసలు విషయం వేరే ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందట, ఫైనల్ ఎడిట్ కూడా లాక్ చేశారట. కానీ సెకండ్ హాఫ్ కి శ్రీకాంత్ ఓదెల వద్ద బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోవడం తో ఇంత ఆలస్యం అవుతూ వచ్చింది అట. అంతే కాకుండా రీ షూట్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయట, నాని కి సైతం డైరెక్టర్ మీద తీవ్రమైన అసహనం ఏర్పడిందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే , ఈసారైనా చెప్పిన సమయానికి ఈ చిత్రాన్ని తీసుకొస్తారా లేదా అనేది చూడాలి.
