Relationship Tips: ‘ నేటి వేగవంతమైన జీవనశైలిలో భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు గడిపే సమయం చాలా తగ్గిపోయింది. ఉదయం ఆఫీసుకు వెళ్లే హడావుడి, సాయంత్రం పనిభారం, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి కారణాలతో భావోద్వేగ అనుబంధం క్రమంగా బలహీనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దాంపత్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ‘ఆరు సెకన్ల ముద్దు’ అనే సులభమైన పద్ధతిని రిలేషన్షిప్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆరు సెకన్ల పాటు కిస్ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి?
సాధారణంగా చాలా మంది ఉదయం ఇంటి నుంచి బయలుదేరే ముందు భార్యకు లేదా భర్తకు త్వరత్వరగా ‘బై’ చెప్పి వెళ్లిపోతుంటారు. అయితే నిపుణుల ప్రకారం.. కేవలం ఒక క్షణం ఆగి భాగస్వామిని దగ్గరకు తీసుకుని, కళ్లలోకి ప్రేమగా చూస్తూ కనీసం ఆరు సెకన్ల పాటు ముద్దు పెట్టుకోవాలి. ఈ సమయంలో ఆఫీసు పనులు, సమావేశాలు లేదా ఇతర ఆలోచనల గురించి ఆలోచించకుండా పూర్తిగా ఆ క్షణాన్ని ఆస్వాదించాలని వారు సూచిస్తున్నారు.ఇలా చేస్తే కొత్త ఎనర్జీ వచ్చినట్లు అవుతుందని తెలుపుతున్నారు.
ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది అలసటతో నేరుగా సోఫాలో కూర్చోవడం లేదా మొబైల్లో మునిగిపోవడం చేస్తుంటారు. కానీ ఇంటికి వచ్చిన వెంటనే చిరునవ్వుతో భాగస్వామిని పలకరించి, మరోసారి ఆరు సెకన్ల పాటు ప్రేమగా ముద్దాడితే రోజంతా ఉన్న ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
మనిషి ప్రేమగా కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం సమయంలో శరీరంలో ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీనిని ‘లవ్ హార్మోన్’ అని కూడా పిలుస్తారు. ఇది విశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆరు సెకన్ల పాటు కొనసాగే ముద్దు ఈ హార్మోన్ విడుదలకు మరింత అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ చిన్న ప్రేమపూర్వక చర్య దంపతులకు భావోద్వేగ శక్తిని అందిస్తుంది. ఎలా ఒక ఎనర్జీ డ్రింక్ శరీరానికి తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తుందో, అలాగే ఆరు సెకన్ల ముద్దు మనసుకు ఆనందాన్ని, సానుకూల భావాలను అందిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న అపార్థాలు, ఒత్తిడులు, పనిబారాలు సహజం. అయితే ప్రతిరోజూ కొన్ని సెకన్ల పాటు అయినా ప్రేమను వ్యక్తపరచడం వల్ల ఒకరిపై మరొకరికి ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. కమ్యూనికేషన్ మెరుగుపడటంతో పాటు భావోద్వేగ దూరం తగ్గే అవకాశం ఉంటుంది.

