Allu Arjun family photo : సినీ సెలబ్రిటీల నుండి కచ్చితంగా కొన్ని విషయాలను ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలి చెప్పడానికి నిదర్శనం మెగా ఫ్యామిలీ. అన్నదమ్ములు అంటే ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు, ఆస్తుల విషయం లో గొడవలు వేసుకుంటూ ఉంటారు, అనే మనం అనుకుంటూ ఉంటాము. మన సమాజం లో జరిగే అంశాలను ఆధారంగా తీసుకొని ఇలాంటివి చెప్తుంటాము. కానీ మెగా ఫ్యామిలీ లో ఇప్పటికీ చిరంజీవి , పవన్ కళ్యాణ్ , నాగబాబు వంటి వారు రామలక్షణులు లాగానే ఉంటున్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అల్లు ఫ్యామిలీ లేటెస్ట్ జనరేషన్ కూడా అనుసరిస్తున్నారు. వీళ్లంతా ఒకే ఉమ్మడి కుటుంబం లాగా, ఒకే ఇంట్లో ఏళ్ళ తరబడి నుండి ఉంటున్నారు. ఒకే కుటుంబం లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు గొడవలు వస్తుంటాయి. వీళ్ళ కుటుంబం లో కూడా అలాంటి గొడవలే అప్పుడప్పుడు వచ్చి ఉండొచ్చు.
కానీ ఇలా కలిసి ఒకే చోట ఉండడం , వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుకోవడం వంటివి చూసే నెటిజెన్స్ కి ఎంతో బాగుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో అల్లు ఫ్యామిలీ మొత్తం కలిసున్న ఫోటో ఒకటి బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటో లో అల్లు అర్జున్ , అల్లు స్నేహా రెడ్డి , అల్లు శిరీష్ , అల్లు శిరీష్ సతీమణి అల్లు నయనికా ఉన్నారు. అల్లు అర్జున్ తన కూతురు అల్లు స్నేహా రెడ్డి తో సరదాగా ఆదుకుంటుండం చూసేందుకు ఎంతో చక్కగా ఉంది. ఈ ఫోటో ఫ్రేమ్ లో ఒక్క అల్లు అయాన్ ఒక్కటే మిస్ అయ్యాడు. బహుశా ఆ ఫోటో ని తీసింది అయాన్ కావొచ్చు. కుటుంబం అంటే ఇలా ఎప్పుడూ కలిసుండాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ ఫోటో క్రింద కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటో ని మీకోసం క్రింద అందిస్తున్నాం , మీరు కూడా చూసేయండి.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఆయన తమిళ డైరెక్టర్ అట్లీ తో కలిసి ‘రాకా’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, దీపికా పదుకొనే , మృణాల్ ఠాకూర్ , జాన్వీ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అదే విధంగా నేషనల్ క్రష్ రష్మిక మందాన ఈ చిత్రం లో విలన్ క్యారెక్టర్ చేస్తుంది.
