iQOO 15 5G OnePlus 15 5G: మొబైల్స కోనేవారిలో రకరకాల అభిరుచులను కలిగి ఉంటారు. కొందరు బడ్జెట్ లోనే మొబైల్స్ కొనాలని చూస్తే..మరికొందరు ప్రీమియం మొబైల్స్ కోసం ఎదురుచూస్తారు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ప్రస్తుతం iQOO 15 5G, OnePlus 15 5G మోడల్స్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. వీటిల్లో ఉండే భారీ బ్యాటరీ, అల్ట్రా-ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ నేటితరం వారిని ఆకట్టుకుంటున్నాయి.
iQOO 15 5G:
iQOO 15 5G స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా గేమర్లను, పవర్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. వీరిని దృష్టిలో పెట్టుకునే ఈ కంపెనీ ఈ మొబైల్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Elite ప్రాసెసర్‌ను అమర్చారు. దీని డిస్‌ప్లే విషయానికొస్తే.. ఇందులో 6.85 అంగుళాలు ఉండగా.. 2K Samsung M14 OLED ప్యానెల్‌తో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండనుంది.
ఈ ఫోన్‌లోని అతిపెద్ద హైలైట్ ఇందులో ఉండే బ్యాటరీ. ఈ మొబైల్ లో 7000mAh భారీ బ్యాటరీ ఉండగా.. దీనికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఇంతపెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ కేవలం 8.1mm మందంతో స్లిమ్‌గా ఉంటుంది. కెమెరాల విషయానికి వస్తే… బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. ఇందులో 3x ఆప్టికల్ జూమ్ ఇచ్చే పెరిస్కోప్ లెన్స్ కూడా ఉంది. భారతదేశంలో దీని ప్రారంభ ధర సుమారు రూ. 72,998 గా ఉంది.
OnePlus 15 5G:
ఆల్ రౌండర్ ఫ్లాగ్‌షిప్OnePlus 15 5G కూడా అదే Snapdragon 8 Elite చిప్‌సెట్‌తో ఉంటుంది. ఈ మొబైల్ లో 6.78 అంగుళాల 1.5K లేదా 2K LTPO AMOLED డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇందులో కొత్తగా ‘యాక్షన్ బటన్’ను కూడా ప్రవేశపెట్టారు.
బ్యాటరీ విభాగంలో OnePlus ఒక అడుగు ముందుకు వేసి 7300mAh ‘గ్లేసియర్ బ్యాటరీ’ని అందించింది. దీనికి 120W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోటోగ్రఫీ లవర్స్ కోసం ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉండగా.. 50MP అల్ట్రావైడ్, 3.5x ఆప్టికల్ జూమ్ కలిగిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కనిపిస్తుంది. దీని ధర కూడా దాదాపు రూ.72,999 నుండి ప్రారంభమవుతుంది.