Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) , అట్లీ(atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అంతర్జాతీయ చిత్రం ‘రాకా'(Raka Movie) పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవనే చెప్పాలి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా కనిపించని గెటప్ లో అల్లు అర్జున్ కనిపిస్తూ , ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ద్వారా అందరినీ షాక్ కి గురయ్యేలా చేశారు. ఆ గెటప్ పై ట్రోల్స్ బాగానే వచ్చాయి కానీ, ఇలాంటి గెటప్స్ వేసే ధైర్యం ఇండియా లో అల్లు అర్జున్ కి తప్ప , ఎవరికీ లేదని అంటున్నారు విశ్లేషకులు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
అదేమిటంటే , ఈ చిత్రం లో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం జరగబోయే భారీ షెడ్యూల్ లో అల్లు అర్జున్ , అక్షయ్ కుమార్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ క్యామియో రోల్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. చాలా కాలం తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాగా ఈ చిత్రం విడుదల అవ్వబోతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే టాలీవుడ్ లో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి , కచ్చితంగా ఇక్కడ సెన్సేషనల్ ఓపెనింగ్స్ వస్తాయి , అందులో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా కోలీవుడ్ లో డైరెక్టర్ అట్లీ కి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కారణంగా అక్కడ కూడా ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ రావొచ్చు.
ఇక బాలీవుడ్ లో అయితే అల్లు అర్జున్ కి ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ఉంది. ఆ స్టార్ ఇమేజికి తోడుగా జవాన్ లాంటి సెన్సేషనల్ చిత్రాన్ని తెరకెక్కించిన అట్లీ బ్రాండ్, దీపికా పదుకొనే , జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి వారు తోడు అయ్యారు, ఈ మాత్రం చాలు బాలీవుడ్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని దక్కించుకోవడానికి అని అందరూ అనుకుంటూ ఉంటే , ఇప్పుడు అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ కూడా తోడయ్యాడు. ఇక బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు , అందులో ఒకటి విలన్ పాత్ర, అదే విధంగా రష్మిక కూడా కీలక పాత్ర పోషించబోతుంది , ఈమెది కూడా విలన్ క్యారెక్టర్ అని సమాచారం. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి.