Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని పై కొత్త ప్రచారం ప్రారంభం అయ్యింది. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం కానున్నట్లు టాక్ నడుస్తోంది. కూటమి పార్టీలో చేరడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా తెగ హల్చల్ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో కొడాలి నాని పెద్దగా కనిపించడం లేదు. మీడియా ముందుకు కూడా రావడం లేదు. అయితే ఆయన ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన బిజెపి నేతలతో సన్నిహితంగా మెలుగుతూ కనిపిస్తున్నారు. సర్వసాధారణంగా ఆయన వల్లభనేని వంశీ మోహన్ లాంటి నేతలతోనే బయటకు కనిపిస్తారు. అటువంటిది బిజెపి నేతలతో కలిసి తిరుగుతుండడంతో ఆయన కమలం గూటికి చేరడం ఖాయమన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమిలో ఆయనకు బిజెపి ఏకైక ఆప్షన్ గా తెలుస్తోంది.
* నాలుగు సార్లు ఎమ్మెల్యేగా..
కొడాలి నాని సీనియర్ మోస్ట్ లీడర్. నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. రెండుసార్లు టిడిపి నుంచి గెలిచారు. మరో రెండు సార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి మాత్రం ఓటమి చవి చూశారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకం అవుతారని భావించారు. కానీ ఆయన వచ్చినట్టే వచ్చి పెద్దగా కనిపించకుండా మానేశారు. అయితే మధ్య మధ్యలో మాత్రం వచ్చి ప్రకటనలు చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో పర్యటనలు అంతంతమాత్రంగా చేస్తున్నారు.
* త్వరలో అరెస్ట్ అంటూ ప్రచారం..
త్వరలో కొడాలి నాని అరెస్టు ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన బిజెపి నేతలతో తరచూ కనిపిస్తున్నారు కొడాలి నాని. ఏపీ రాజకీయాల గురించి అస్సలు స్పందించడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర చెందిన ఓ ఎమ్మెల్యే తో బయట తిరుగుతూ కనిపిస్తుండడం విశేషం. బిజెపి నేతల ద్వారా కమలం పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆయన టిడిపిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. వైసీపీలో రాజకీయంగా ఎదిగారు. అదే వైసీపీలో వివాదాస్పద ముద్రను అంటించుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపిలోకి రీఎంట్రీ అంటే కుదరదు. అందుకే బిజెపిలోకి వెళ్లి సేఫ్ జోన్ లో నిలవాలని చూస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతారో చూడాలి.