Homeజాతీయ వార్తలుMamata Banerjee: బెంగాల్ లో మమతక్క ఖేల్ ఖతమైనట్టేనా..

Mamata Banerjee: బెంగాల్ లో మమతక్క ఖేల్ ఖతమైనట్టేనా..

Mamata Banerjee: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అందిరి దృష్టి పశ్చిమబెంగాల్‌పై ఉంది. ఇక పశ్చిమబెంగాల్‌ ఓటర్ల దృష్టి ఈసారి మమతపై ఉంది. మమత గెలుస్తుందా.. గెలవకపోతే మమత పరిస్థితి ఏంటి అన్న చర్చ జరుగుతోంది. 15 ఏళ్ల అధికార పాలనలో కొంత వ్యతిరేకత ఏర్పడినా, ప్రజలు ఈసారి మమతా పరిస్థితినే అడుగుతున్నారు. 2021లో నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారిని ఓడించిన మమతా, తర్వాత భవానీపూర్‌ ఉప ఎన్నికలో 60 వేల మెజారిటీతో గెలిచింది. కానీ ఈసారి సువెందు అధికారి నందిగ్రామ్‌తోపాటు భవానీపూర్‌లో కూడా పోటీ చేస్తున్నారు..

భవానీపూర్‌ ఓటర్ల లెక్కలు..
భవానీపూర్‌ నియోజకవర్గంలో 76 శాతం హిందువులు, 24 శాతం ముస్లింలు ఉన్నారు. వీరిలో 46 శాతం బెంగాలీలు, 34 శాతం నాన్‌–బెంగాలీలు (గుజరాతీలు, మార్వాడీలు, బిహార్, యూపీ నుంచి వలసలు). ఇటీవల మమతా గుజరాతీలు, హిందీ మాట్లాడేవారిపై వ్యాఖ్యలు ఈ ఓటర్లలో వ్యతిరేకత రేకెత్తించాయి. 2014 నుంచి ఇక్కడ బీజేపీ బలం పెరుగుతోంది. 2024 మున్సిపల్‌ ఎన్నికల్లో భవానీపూర్‌ వార్డుల్లో తృణమూల్‌ రెండో స్థానంలో నిలిచింది, బీజేపీ గెలిచింది.

47 వేల ఓటర్ల తొలగింపు..
ఈసారి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) మమత సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో 47 వేల ఓట్లు తొలగించారు. ముఖ్యంగా 14 వేల ఓట్లపై జుడీషియల్‌ అడ్యుకేషన్‌ జరగాలి. మొత్తం ఓటర్లు తగ్గడంతో మమతా మెజారిటీ కన్నా 4 వేల ఓట్లు తగ్గాయి. 47 వేలలో మమతకు ఓటు వేసేవారు, బీజేపీ ఓటర్లు కూడా ఉన్నారు. ఈ మార్పులు మమతా గెలుపును కష్టతరం చేశాయి.

భవానీపూర్‌ ఎన్నిక ఈసారి మమతా బెనర్జీ వ్యక్తిగత ప్రతిష్టాత్మక పోరు. 15 ఏళ్ల పాలనలో వ్యతిరేకత, ఓటర్‌ లిస్ట్‌ మార్పులు, స్థానిక ఎన్నికల ఓటమి, సువెందు డబుల్‌ పోటీ – అన్నీ మమతా మెజారిటీని సంక్షోభంలోకి నెట్టాయి. గెలిస్తే తృణమూల్‌ బలపడుతుంది, ఓడితే మమతా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఈ ఎన్నిక బెంగాల్‌ రాజకీయాలను మతులపు తిప్పనున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular