Anil Ravipudi Venkatesh Movie OTT Rights: ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా ట్రెండ్ లో , కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిపోయింది. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా , కమర్షియల్ సినిమా చేస్తే చూసేందుకు సిద్ధంగా లేరు. అది గత నెలలో విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయం లో మరోసారి అందరికీ క్లారిటీ వచ్చింది. కానీ ఇలాంటి పాన్ ఇండియా జమానా లో కూడా కమర్షియల్ సినిమాలు ఒక డైరెక్టర్ తీస్తేనే జనాలు చూస్తారు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు , అనిల్ రావిపూడి(Anil Ravipudi) అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ‘పటాస్’ చిత్రం నుండి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరకు అనిల్ రావిపూడి సినీ ప్రయాణం చూస్తే, ఎవరికైనా ముచ్చట వేయక తప్పదు. కామెడీ జానర్ ని ఈమధ్య మన టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ కూడా సరిగా హ్యాండిల్ చేయలేదు, శ్రీనువై వైట్ల ఒక్కడే ఒకప్పుడు ఈ జానర్ లో అల్లాడించేవాడు, ఇప్పుడు ఆయన ఫార్మ్ కోల్పోవడంతో ఎవ్వరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారు అని అంతా అనుకుంటున్న సమయం లో వచ్చాడు అనిల్ రావిపూడి.
ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ ని పట్టుకొని , వాళ్ళ పొట్ట చెక్కలు అయ్యే కాన్సెప్ట్స్ తో సినిమాలు చేయడం అనేది ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో రీజినల్ ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న అనిల్ రావిపూడి , ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో మరో భారీ రీజనల్ ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఆయన విక్టరీ వెంకటేష్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లోనే కాదు , మార్కెట్ లో కూడా విపరీతమైన బజ్ ఉంది.
ఆయన గత రెండు చిత్రాలు థియేటర్స్ లో ఎలా అయితే రీజనల్ ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి, ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం జీ5 యాప్ లోకి ఎంట్రీ ఇచ్చి రెండు నెలలు అయ్యింది. కానీ ఇప్పటికీ కూడా ఈ చిత్రం నాన్ స్టాప్ గా టాప్ 10 లో ట్రెండ్ అవుతూనే ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అయితే ఏకంగా ఏడాది పాటు ట్రెండ్ అయ్యింది. అనిల్ రావిపూడి సినిమాలకు ఓటీటీ లో ఆ రేంజ్ డిమాండ్ ఉండడంతో త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న వెంకటేష్ మూవీ ని జీ 5 సంస్థ 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. రాబోయే రోజుల్లో ఇంకా ఈ చిత్రం ఎన్ని అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి.