Nissan Juke EV 2027: ప్రస్తుత కాలంలో చాలామంది ఎలక్ట్రిక్ కార్ల వైపే ముగ్గు చూపుతున్నారు. దీంతో కంపెనీలు సైతం వీటి ఉత్పత్తికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఇందులోనూ ప్రీమియం కార్లను ఎక్కువగా మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా Nissan కంపెనీకి చెందిన ఓ కొత్త కారు త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. అయితే దీనిని ఏప్రిల్ 15న ఆవిష్కరించారు. ఈ కారు ను చూస్తే ఎవరైనా బొమ్మ అనుకుంటారు. కానీ ఎంతో స్టైలిష్ గా ఉండే ఈ కారు కోసం చాలామంది ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. ఇందులో ఉండే ప్రీమియం ఫీచర్లతో పాటు బ్యాటరీ వ్యవస్థ కూడా బలంగా ఉండడంతో ఈ కారు గురించి చర్చ ఆసక్తికరంగా మారింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.
Nissan కంపెనీ నుంచి రాబోతున్న కొత్త కారు Juke EV.. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ అయిన ఈ కారు డిజైన్ చూస్తే వెంటనే కొనాలని అనిపిస్తుంది. దీనికి ఉండే పదునైన మడతలు, విభజించబడిన LED హెడ్ల్యాంప్స్ పిచ్చెక్కిస్తుంటాయి. గ్రీన్ తో పాటు బ్లాక్ కలర్ లో ఉండే రూఫ్ మొత్తం ప్రత్యేకంగా కనిపిస్తుంది. CMF EV ప్లాట్ ఫామ్ పై నిర్మించబడిన ఈ కారులో 52 కిలో వాట్ నుంచి 75 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లో ఉండనున్నాయి. ఇవి 215 హార్స్ పవర్ అవుట్ పుట్ నో అందిస్తాయి. వీటిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 600 నుంచి 620 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. అట్రాక్షన్ గా కనిపించాలని అనుకునే వారికి.. లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఈ కారు బాగా నచ్చుతుందని కంపెనీ ప్రతినిధులు నమ్ముతున్నారు.
ఇందులో టెక్నాలజీ పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా, వెహికల్ టూ గ్రిడ్ సామర్థ్యం వంటివి ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ లోని నిస్సాన్ లో తయారవుతున్న ఈ కారు యూరప్ ప్రజల కోసం 2027 సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. యూరప్ మొత్తం ఎలక్ట్రిక్ వేరియంట్ పై ఆసక్తి చూపుతుండడంతో నిస్సాన్ నుంచి ఈ కొత్త కారు రాబోతుంది. దీని ధర అధికారికంగా ప్రకటించినప్పటికీ కొందరు అంచనాలు వేస్తున్నారు. అయితే ఇది మార్కెట్లోకి వచ్చి ఎలాంటి అలజడి సృష్టిస్తుందో చూడాలి.