Arshdeep Singh Snapchat: టీమ్ ఇండియాలో కీలక బౌలర్ గా, ఐపీఎల్ లో పంజాబ్ జట్టులోనూ కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు అర్ష్ దీప్ సింగ్. వేగవంతమైన బంతులు వేసి.. అదే స్థాయిలో వికెట్లను పడగొట్టడంలో ఇతడు సిద్ధహస్తుడు. పైగా ఆరు బంతులను కూడా డిఫరెంట్ గా వేస్తాడు. అందువల్లే ఇతడు టి20 ఫార్మేట్ లో నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అర్ష్ దీప్ సింగ్.. విపరీతంగా కష్టపడి ఇక్కడి దాకా వచ్చాడు.
సోషల్ మీడియాలో అర్ష్ దీప్ సింగ్ చురుకుగా ఉంటాడు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అందులో పంచుకుంటాడు. ఇటీవల టి20 వరల్డ్ కప్ లో టీమిండియా గెలుపులో అతడు ముఖ్యపాత్ర పోషించాడు. టీమిండియా ట్రోఫీ గెలిచిన తర్వాత అదిరిపోయే స్టెప్పులు వేసి సోషల్ మీడియాను మొత్తం తన వైపు తిప్పుకున్నాడు.
అర్ష్ దీప్ సింగ్ కు అన్ని సామాజిక మాధ్యమాలలో ఖాతాలు ఉన్నాయి. ఇటీవల అతడు స్నాప్ చాట్ లో ఒక ఫోటో షేర్ చేశాడు. అందులో అతడు ఒక యువతి చేతులు పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో ఆ యువతి ముఖం అస్పష్టంగా ఉంది. అయితే ఆ ఫోటో ద్వారా నెటిజన్లు ఆ అమ్మాయి పూర్తి వివరాలు కనిపెట్టారు.
అర్ష్ దీప్ సింగ్ చేతులు పట్టుకుని ఫోటో దిగిన ఆ అమ్మాయి పేరు సమ్రీన్ కౌర్. ఆమె చేతి మీద ఉన్న టాటూను చూసి అభిమానులు గుర్తించారు.. సమ్రీన్, అర్ష్ దీప్ సింగ్ ప్రేమలో ఉన్నారని అభిమానులు ఒక అంచనాకొచ్చారు. ఇటీవల ముల్లాన్ పూర్ లో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. దానికి ఆమె హాజరైంది. పంజాబ్ జట్టు జెర్సీ ధరించి ఆ ఫొటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు అంచనా వేసింది నిజమైంది.
సమ్రీన్ పంజాబ్ లో పుట్టింది. పూణేలోని సింబయోసిస్ కాలేజీలో విద్యాభ్యాసం చేసింది. పంజాబ్ భాషలో అనేక మ్యూజిక్ వీడియోలను రూపొందించింది. ఓటీటీ లో అనేక చిత్రాలలో నటించింది. ఏమైనా ఇంస్టాగ్రామ్ లో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. బాలీవుడ్ లో 83 అని ఒక సినిమాలో ఈమె నటించింది. 2018లో నిర్వహించిన మిస్ ఇండియా పోటీలలో ఫైనల్ దాకా వెళ్ళింది. అయితే సమ్రిన్..అర్ష్ దీప్ సింగ్ రిలేషన్ గురించి ఇంతవరకు అఫీషియల్ గా ప్రకటించలేదు.