YCP Political Scandal: టీటీడీ ( Tirumala Tirupati Devasthanam) నెయ్యి కల్తీ వ్యవహారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే మరో అంశం వెలుగులోకి వచ్చింది. వైసిపి హయాంలో సహకార రంగంలో నడుస్తున్న ఓ డైరీని ప్రైవేటు సంస్థలకు అప్పగించారని.. అవి ఇష్టారాజ్యంగా కల్తీ చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకు మరో వివాదం చుట్టుకున్నట్లు అవుతోంది. ఇప్పటివరకు టీటీడీ పవిత్రతకు ఇబ్బంది పెట్టారన్న విమర్శ ఎదుర్కొంటోంది ఆ పార్టీ. ఇప్పుడు ఏకంగా తెలుగు రాష్ట్రాల ప్రజారోగ్యాన్ని సైతం ప్రమాదంలో పెట్టిందన్న విమర్శలు వస్తుండడం విశేషం.
Also Read: ప్రాధేయపతూనే గాంభీర్యం.. ఎందుకు ట్రంపూ ఇంత బలుపు?
* అడ్డగోలుగా ఒప్పందాలు..
ఏపీ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్( AP Dairy development Federation ) పరిధిలో ఉంది విజయ బ్రాండ్. అయితే దీని వినియోగ హక్కులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు, ముఖ్యంగా గుజరాత్ కు చెందిన మేఘనా ఫుడ్స్ వంటి సంస్థలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టబెట్టారు అన్న విమర్శలు ఉన్నాయి. అయితే విజయ బ్రాండ్ పేరుతో కల్తీ ఫుడ్స్ మార్కెట్లో వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ లో తయారవుతున్న నెయ్యిని విజయా లేబుల్ తో తెలంగాణతో పాటు ఏపీ మార్కెట్లో విక్రయిస్తున్నారని.. అందులో వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్లు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇప్పుడు ఇదే జాతీయ స్థాయిలో కొత్త చర్చకు దారితీసింది. పాల ప్యాకెట్ల పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రభుత్వ డైరీ వివరాలకు బదులుగా ప్రైవేటు కంపెనీల పేర్లు రావడం గమనార్హం.
* గత పాలకుల పై విమర్శలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అడ్డగోలుగా ఒప్పందాలు జరిగాయని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తాజాగా ఆరోపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి.. తప్పిదాలకు పాల్పడిన గత పాలకులతో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. తద్వారా తెలంగాణలో గులాబీ పార్టీ.. ఏపీలో జగన్ పార్టీ ఇప్పుడు ఇరకాటంలో పడినట్టు అయ్యింది.