fast food health risks : ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక కుగ్రామం అయిపోయింది భయ్యా. అందువల్లే రకరకాల రుచులు మనకు తెలియకుండానే మన ముందు వచ్చి వాలుతున్నాయి. ఆ రంగు రంగుల ఆహార పదార్థాలను చూసిన తర్వాత మన నాలిక ఎలా ఉంటుంది.. ఎందుకు ఆగుతుంది.
చికెన్ మధ్యలో కూర్చిన పిజ్జాను.. బట్టర్ బాగా దట్టించిన బర్గర్ ను .. నూనెలో వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్ ను అదే పనిగా తినడం మనలో చాలామందికి అలవాటు. పైగా చికెన్ వింగ్స్.. చికెన్ బ్రెస్ట్.. చికెన్ నగ్గెట్స్.. పాస్తా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం తినేస్తూనే ఉంటాం.
ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినప్పటికీ.. అవి తింటే మధుమేహం వంటి రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నప్పటికీ చాలామంది తినకుండా ఉండలేరు. పైగా వాటిని తినడాన్ని గొప్పగా చెప్పుకుంటారు. ఈవెనింగ్ టైం లో అయితే కేఎఫ్ సీ, మెక్ డోనాల్డ్స్, బర్గర్ కింగ్.. ఇలా అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు జనాలతో కిటకిటలాడి పోతుంటాయి.
వాస్తవానికి పిజ్జాలు.. బర్గర్లు.. ఫ్రెంచ్ ఫ్రైస్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఎలా తయారు చేస్తున్నారో తెలుసా.. వాటిలో ఎటువంటి ప్రమాదకరమైన పదార్థాలు ఉపయోగిస్తున్నారో తెలుసా.. ఆ పదార్థాల గురించి చెబితే మీరు కనీసం బర్గర్లను ముట్టరు. పిజ్జాలను తినరు. ఫ్రెంచ్ ఫ్రైస్ జోలికి వెళ్లరు.
మనదేశంలో పిజ్జాలు, బర్గర్లను విక్రయించే సంస్థల్లో మెక్ డోనాల్డ్స్ ఒకటి. ఈ కంపెనీకి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న అవుట్లైట్లో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అందులో 40 లీటర్ల నూనెను పదేపదే వినియోగించినట్లు తేలింది. 650 కిలోల కల్తీ పనీర్.. కుళ్ళిపోయిన టమాటాలు లభించాయి. ఆ ఆయిల్ ఎలా ఉందంటే.. పెట్రోల్, డీజిల్ కంటే నల్లగా ఉంది. అటువంటి ఆయిల్ ఉపయోగించి చేస్తున్న వంటకాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “బ్రాండెడ్ అయినంత మాత్రాన ప్రతిదీ గొప్పగా ఉండాలని లేదు. శుభ్రంగా ఉండాలని అనుకోవడం కూడా తప్పే. అందువల్లే బయట తిండి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని” ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.