Maulana Shamsul Huda Khan: మన దేశంలో జరిగినన్ని చిత్ర విచిత్ర ఘటనలు ప్రపంచంలో ఎక్కడా జరగవు. దేశంలో ఉంటూనే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేశంలో ఉంటూనే విదేశాలకు వెళ్లి మన దేశాన్ని కించపరిచేలా మాట్లాడడం వంటి స్వేచ్ఛ మన దేశంలోనే ఉంటుంది. ఇక మన దేశంలో చదువుకుని.. జ్ఞానం పొంది దానిని విదేశాల అభివృద్ధికి ఉపయోగించే అవకాశం కూడా మన దేశంలో ఎక్కువ. తాజాగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ ప్రభుద్ధుడి ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో పౌరసత్వం వదులుకున్న వ్యక్తి ప్రభుత్వ జీతం, పెన్షన్, ఓటు హక్కు కొనసాగించాడు. ఇది మన వ్యవస్థలోని లోపాలను చూపుతోంది.
కీలక సంఘటనలు
ఉత్తరఫ్రదేశ్‌కు చెందినా మౌలానా షమ్సుల్ హుదా ఖాన్ 2013లో భారత పౌరసత్వాన్ని వదులుకుని బ్రిటిష్ వెళ్లాడు. అయితే అతను 2013–15లో ఉత్తరప్రదేశ్ మదరసాలో ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేస్తున్నట్లు వేతనం తీసుకున్నాడు. 2017 వరకు జీతం, 2023 వరకు పెన్షన్ పొందాడు. అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇంగ్లండ్ నుంచి విమానంతో వచ్చి ఓటు వేశాడు. ఓటర్ల జాబితాలో పేరు కొనసాగడం విస్మయం కలిగించింది.
దర్యాప్తు సంస్థల విచారణ..
అతనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మానీ లాండరింగ్ కేసులో దాఖలలు చేసింది. విదేశీ నిధులతో మదరసాల నిర్మాణం, ఆస్తుల కొనుగోలు ఆరోపణలు ఉన్నాయి. యూపీ ఏటీఎస్‌పై ఇప్పటికీ దర్యాప్తుస్తోంది. దర్యాప్తుకు దారితీసింది.
పౌరసత్వ మార్పిడి తర్వాత ఉద్యోగ, పెన్షన్, ఓటర్ లిస్ట్ సమస్యలు గుర్తించకపోవడం పరిపాలనా లోపాలను తెలియజేస్తుంది. ఇలాంటి సందర్భాలు గుర్తింపు విధానాల బలహీనతను సూచిస్తాయి. భవిష్యత్తులో డేటాబేస్ లింకింగ్, డిజిటల్ ట్రాకింగ్ అవసరం.