The Raja Saab 6 Days Collections : భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(The Rajasaab Movie) మూవీ పరిస్థితి ఎలా అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలం లో విడుదలైన సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’ చిత్రమే స్టార్ హీరోల్లో అతి నీచమైన ఫుల్ రన్ ని దక్కించుకున్న సినిమా అని అంతా అనుకున్నారు. కానీ ‘రాజా సాబ్’ చిత్రం ‘హరి హర వీరమల్లు’ ని మించిన డిజాస్టర్ ఫ్లాప్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. సంక్రాంతి సెలవులు ఉన్నాయి కాబట్టి, ఈ చిత్రం కచ్చితంగా సెలవుల్ని ఉపయోగించుకొని కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ కి వెళ్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ కనీస స్థాయి వసూళ్లను కూడా ఈ చిత్రం నమోదు చేసుకోలేకపోతోంది. ఆరు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబడుతుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
నైజాం ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 23 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి 48 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా ఈ చిత్రం, పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. అది అసాధ్యం అనే విషయం ట్రేడ్ వర్గాలకు కూడా తెలుసు. ఇక సీడెడ్ ప్రాంతం లో అయితే ఈ చిత్రం విడుదలకు ముందు 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకుంది. ఆరు రోజులకు కలిపి కేవలం 9 కోట్ల 37 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది ఈ చిత్రం. ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది మీరే అర్థం చేసుకోండి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 8 కోట్ల 96 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం తూర్పు గోదావరి నుండి 7 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.
అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా నుండి 4 కోట్ల 94 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాఎం, గుంటూరు జిల్లా నుండి 4 కోట్ల 89 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 4 కోట్ల 87 లక్షల రూపాయిలు, నెల్లూరు నుండి 3 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 66 కోట్ల 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను, 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటక ప్రాంతం లో 8 కోట్ల రూపాయలు షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, హిందీ వెర్షన్ నుండి 11 కోట్ల రూపాయిలు, తమిళనాడు + కేరళ నుండి కోటి 45 లక్షలు , ఓవర్సీస్ నుండి 16 కోట్ల 82 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 103 కోట్ల 91 లక్షల రూపాయిల షేర్ వసూల్, 175 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ ఆరు రోజుల్లో ఈ చిత్రానికి నమోదైంది.