Manchu Manoj David Reddy: పదేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత మంచు మనోజ్(Manchu Manoj) సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటించిన ‘మిరాయ్’, ‘భైరవం’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా మిరాయ్ చిత్రం అయితే పాన్ ఇండియా లెవెల్ లో క్లిక్ అయ్యింది. ఇందులో మనోజ్ విలన్ క్యారక్టర్ చేసినప్పటికీ, హీరో కంటే పవర్ ఫుల్ గా కనిపించడం తో ఆయన క్యారక్టర్ కి మంచి పేరొచ్చింది. అయితే రీ ఎంట్రీ తర్వాత చేసిన రెండు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ లో కనిపించిన మంచు మనోజ్, ఇప్పుడు మళ్లీ హీరో గా కెరీర్ ని ఫ్రెష్ గా ప్రారంభించబోతున్నాడు. ఆయన హీరో గా ‘డేవిడ్ రెడ్డి'(David Reddy) అనే పాన్ ఇండియన్ చిత్రం తెరకెక్కబోతుంది.
నిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ ని చూసి చెప్పేయొచ్చు, ఈ చిత్రం క్వాలిటీ పరంగా ఎంత రిచ్ గా ఉండబోతుంది అనేది. రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా క్వాలిటీ ఉంది. ఈ చిత్రానికి హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనకు ఇదే తొలిచిత్రం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, మన దేశానికీ స్వాతంత్రం రావడానికి ముందు జరిగిన స్టోరీ అని టీజర్ ని చూస్తే తెలుస్తోంది. ఇండియా కి, బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇందులో హీరో క్యారక్టర్ ఉంటుంది. ఇందులో స్వతంత్ర సమరయోధుల పాత్రలు కూడా ఉంటాయని టీజర్ ద్వారా హింట్స్ ఇచ్చాడు డైరెక్టర్. ఈ క్యారెక్టర్స్ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan), తమిళ హీరో శింబు(Silambarasan TR) చేస్తున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు వినిపించాయి.
అయితే నిన్న జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో విలేఖరులు సోషల్ మీడియా లో జరిగిన ఈ ప్రచారాన్ని మంచు మనోజ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అందుకు స్పందిస్తూ ‘ప్రస్తుతానికి అయితే మేము ఏ హీరో ని కూడా సంప్రదించలేదు. వీటి గురించి మాట్లాడడానికి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో అన్నీ మీకు వివరంగా చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. అంటే ఈ రూమర్స్ ని ఆయన పూర్తిగా కొట్టేయలేదు. ఆ ఇద్దరి హీరోలను ఇప్పటి వరకు సంప్రదించని విషయం వాస్తవమే అయ్యుండొచ్చు, కానీ వీళ్లిద్దరి తో ఈ క్యారెక్టర్స్ చేయించాలి అనే ఆలోచన మాత్రం వచ్చి ఉండొచ్చు. అది ఇండస్ట్రీ వర్గాలకు లీక్ అయ్యింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో వీళ్లిద్దరు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం అవుతారా లేదా అనేది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినా డేవిడ్ రెడ్డి టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.