Tamil Directors: ఒకప్పుడు సౌత్ లో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగిన తమిళ్ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు చాలా వరకు డీలా పడిపోయింది. తమిళ్ నుంచి ఒక్కటి కూడా పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ సినిమా రావడం లేదంటే వాళ్ళు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు… తెలుగు సినిమా ఇండస్ట్రీ కంటే మేము ఎప్పుడూ ముందు వరుసలో ఉంటామని చెప్పుకునే తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు సైతం ఇప్పుడు చాలా వరకు డీలా పడిపోవడంతో వాళ్ళ ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారింది. ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ సినిమాలను తమిళ్ సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్లు సైతం ఇప్పుడు తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇప్పటికే వాళ్ళు చాలా వరకు లేట్ చేశారు. దాంతో కన్నడ ఇండస్ట్రీ సైతం ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ కంటే ముందు వరుసలోకి వచ్చే అవకాశం కూడా ఉంది.
ఎందుకంటే అక్కడి సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కే జి ఎఫ్ 2 సినిమాతో 1200 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన వాళ్ళు కాంతార చాప్టర్ వన్ తో 750 కోట్లను కొల్లగొట్టారు. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ కూడా టాప్ ఇండస్ట్రీ గా ఎదుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు సైతం ఇతర భాషల హీరోల వైపు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
ఎందుకంటే అక్కడ ఉన్న హీరోలతో సినిమాలు చేసిన కూడా వర్కౌట్ కావడం లేదనే ఉద్దేశ్యంతో వాళ్లు నెక్స్ట్ స్టెప్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకప్పుడు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది. తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అనేది నిజంగా చాలా వరకు బాధను కలిగించే విషయమనే చెప్పాలి.
టాప్ స్టార్స్ అందరు 1000 కోట్ల మార్కును టచ్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న కూడా అది కలగానే మిగిలిపోతోంది. ఇక ఫ్యూచర్లో తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ సినిమా అయిన 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…