Spirit Movie : ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన స్పిరిట్(Spirit Movie) మూవీ ప్రారంభోత్సవం నేడు ఉదయం జరిగింది. సందీప్ వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో త్రిప్తి దిమిరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథి గా విచ్చేయడం గమనార్హం. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. సందీప్ వంగ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ విషయాన్నీ ఆయన ఎన్నో వందల ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఆయన ఆఫీస్ కి వెళ్తే ఎక్కడ చూసినా చిరంజీవి ఫొటోలే కనిపిస్తాయి. అంతటి వీరాభిమాని అన్నమాట. అందుకే సందీప్ వంగ తన కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ అయిన స్పిరిట్ మూవీ ప్రారంభోత్సవానికి చిరంజీవి ని ఆహ్వానించడం, అందుకు చిరంజీవి ఒప్పుకొని రావడం జరిగింది.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ఒక వార్త ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో సందీప్ వంగ దృష్టికి ఈ వార్తని తీసుకెళ్లగా, ఆయన అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు. కానీ నేడు ఈ సినిమాని చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించడం చూస్తుంటే, నిజంగానే ఈ సినిమాలో చిరంజీవి ఉన్నాడా?, సందీప్ వంగ సర్ప్రైజ్ ని మైంటైన్ చేయడం కోసం ఆ విషయాన్నీ దాచిపెట్టాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ప్రభాస్ రాకపోవడం పై సోషల్ మీడియా లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ లాంటోడే గౌరవం తో వచ్చి మూవీ టీం ని ఆశీర్వదించినప్పుడు, సొంత సినిమా ప్రారంభోత్సవానికి ప్రభాస్ రాకపోవడం ఏంటి అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ ప్రభాస్ పై మండిపడ్డారు.
కానీ ప్రభాస్ ప్రస్తుతం ఇండియా లేడు. ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం ఆయన మూడు రోజుల క్రితం జపాన్ కి వెళ్ళాడు. అందుకే రాలేకపోయాడని ప్రభాస్ ఫ్యాన్స్ వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా చిరంజీవి, ప్రభాస్ లను ఒకే ఫ్రేమ్ లో మరోసారి చూసే అదృష్టం పోయింది అంటూ సోషల్ మీడియా లో అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. అదే విధంగా కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ కూడా ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించబోతున్నట్టు టాక్. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంచనాలు ఇంకా ఏ రేంజ్ కి వెళ్తాయో చూడాలి.
Heartfelt thank you to our MEGASTAR CHIRANJEEVI sir for blessing the event with his presence. Sir….. your gesture is unforgettable — we all love you @KChiruTweets #SPIRIT MUHURTHAM pic.twitter.com/y9Sckt71IN
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 23, 2025