IND vs SA : మెడ కండరాల నొప్పి వల్ల కెప్టెన్ గిల్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. అతడి గాయం ఇంకా తగ్గకపోవడంతో దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ కు కూడా దూరమయ్యాడు. వన్డే జట్టు ఉప సారధి శ్రేయస్ అయ్యర్ కూడా గాయపడిన నేపథ్యంలో అతడు దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్లో గాయపడిన అయ్యర్.. ఇంకా కోలుకోలేదు.
ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. రెండవ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా తో 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కు మేనేజ్మెంట్ భారత జట్టును ఆదివారం ప్రకటించింది.
3 వన్డేల సిరీస్ కు భారత మేనేజ్మెంట్ జట్టును ప్రకటించింది. భారత జట్టుకు కేఎల్ రాహుల్ సారధిగా వ్యవహరిస్తాడు.. సిరాజ్, బుమ్రా కు మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది.. గిల్, అయ్యర్ గాయాల వల్ల జట్టుకు దూరమయ్యారు.. రోహిత్, విరాట్ కోహ్లీ జట్టులోకి రాబోతున్నారు. తెలుగు ప్లేయర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ కి జట్టులో చోటు లభించింది. వైస్ కెప్టెన్ గా పంత్ ను మేనేజ్మెంట్ నియమించింది. జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా, రుతు రాజ్ గైక్వాడ్, ప్రసిద్, అర్షదీప్, ధృవ్ జురెల్ ను మేనేజ్మెంట్ 3 వన్డేల సిరీస్ కు ఎంపిక చేసింది.
ఇటీవల టీమిండియా వన్డే ఫార్మాట్ లో ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఆస్ట్రేలియా గడ్డమీద జరిగిన 3 వన్డేల సిరీస్ ను టీమిండియా కోల్పోయింది.. ఈ క్రమంలో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ గెలవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే జట్టు రూపకల్పనలో సీనియర్లకు, జూనియర్లకు పెద్దపీట వేసినట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లకు పెద్దపీట వేసిన మేనేజ్మెంట్.. తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి యంగ్ ప్లేయర్లకు కూడా అవకాశం కల్పించింది.
NEWS #TeamIndia's squad for @IDFCFIRSTBank ODI series against South Africa announced.
More details ▶️https://t.co/0ETGclxAdL#INDvSA pic.twitter.com/3cXnesNiQ5
— BCCI (@BCCI) November 23, 2025