Delhi Blasts Case: ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో ఇప్పటికీ కొన్ని విషయాల మీద దర్యాప్తు సంస్థల అధికారులకు క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు కారు, పేలుడు పదార్థాలు, ఉగ్రవాదుల శిబిరాల గురించి మాత్రమే దర్యాప్తు సంస్థలు తీవ్రంగా దృష్టిపెట్టాయి. ఉగ్రవాదులు మాట్లాడుకునేందుకు రకరకాల యాప్స్ వాడారు. ఇందులో కొంతమంది ఉగ్రవాదులకు సాంకేతిక పరిజ్ఞానం మీద అంతగా అవగాహన లేదు. దీంతో వారు సిమ్ లు కొనుగోలు చేశారు. వాటి ద్వారా మాట్లాడారు. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడ వరకు కొనుగోలు చేశారు? ఇప్పుడు ఈ విషయం మీద దర్యాప్తు సంస్థలకు ఒక కీలక విషయం తెలిసింది.
ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడేందుకు నాలుగు వారాల ముందే ఉగ్రవాదులు విపరీతంగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ఉమర్ ఈ దాడికి సంబంధించి బ్లూ ప్రింట్ రూపొందించాడు. దీనికోసం నేపాల్ దేశంలో పాత మొబైల్స్ కొనుగోలు చేశాడు. కాన్పూర్ ప్రాంతంలో సిమ్ కార్డులను కొనుక్కున్నాడు. అయితే ఈ సిమ్ కార్డుల కోసం అతడు ఇచ్చిన ఐడి కార్డులు ఎవరివనే దానిపై పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడే ముందు డాక్టర్లతో కాంటాక్ట్ అయ్యాడు. ఇందులో ఒకరు ఫర్వేజ్. ఫర్వేజ్ డాక్టర్ షహీన్ ను స్వయాన సోదరుడు.
పాత ఫోన్ లను కొనుగోలు చేసి ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. పైగా ఈ ఫోన్లను వాడి పడేశారు. సిమ్ కార్డులు కూడా తీసేసారు.. ఇవన్నీ కూడా దర్యాప్తు సంస్థల ఎంక్వయిరీలో బయటపడ్డాయి. సిమ్ కార్డుల కోసం ఇచ్చిన ఐడి కార్డుల వివరాల గురించి ఆరా తీస్తే అసలు విషయాలు బయటపడతాయని తెలుస్తోంది.. అయితే ఈ సిమ్ కార్డులు మొదట్లో నేపాల్ దేశంలో కొనుగోలు చేశారని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత కాన్పూర్ అని తెలిసింది.. దీంతో ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమందికి పాత్ర ఉంది? వారంతా దేశంలో ఎటువంటి కుట్రలకు పాల్పడ్డారు? అనే విషయాల మీద క్లారిటీ రానుంది.
ఢిల్లీ ఘటనలో ఉగ్రవాదులు అమోనియం నైట్రేట్ ను విపరీతంగా ఉపయోగించారు. అయితే ఇది ఫరీదాబాద్ యూనివర్సిటీలో నిలువ చేశారు. ఈ పేలుడు పదార్థాలు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చాయని దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. ఈ ప్రకారం దేశంలో దారుణాలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర చేశారని తెలుస్తోంది. మరోవైపు జమ్ము కాశ్మీర్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.