Rashmika Mandanna: నేషనల్ లెవెల్ లో ఇప్పుడు హాట్ టాపిక్ మారిన జంట విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన(Rashmika Mandanna). వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియా లో గత కొన్నేళ్ల నుండి ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ అటు విజయ్ నుండి కానీ, ఇటు రష్మిక నుండి కానీ ఈ వార్తలపై ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక రీసెంట్ గా అయితే మీడియా లో వీళ్లిద్దరు నిశ్చితార్థం రహస్యంగా పెద్దల సమక్ష్యం లో చేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై కూడా ఎలాంటి రెస్పాన్స్ ఈ ఇద్దరి నుండి రాలేదు. ఒకపక్క మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలు తప్పు అని చెప్పడం లేదు, మరోపక్క నిజమని కూడా చెప్పడం లేదు. దీనిని బట్టీ చూస్తే వీళ్లిద్దరు నిజంగానే నిశ్చితార్థం చేసుకున్నారు అనేది వాస్తవం అనుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend Movie) అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేసింది.
ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా, ఆమె ఇచ్చిన ఒక పోడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూ లో తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఒక అభిమాని రష్మిక ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు డేటింగ్ ఎవరితో చేస్తారు?, పెళ్లి ఎవరిని చేసుకుంటారు?’ అని ప్రశ్న అడగ్గా, దానికి రష్మిక సమాధానం చెప్తూ ‘జపనీస్ యానిమీ నారుటో తో డేటింగ్ చేస్తాను. విజయ్ దేవరకొండ ని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా లో వీళ్ళ గురించి ఇన్ని ప్రచారాలు జరుగుతున్నప్పటికీ కూడా, రష్మిక ధైర్యం చేసి ఇలా చెప్పిందంటే, కచ్చితంగా వీళ్ళ నిశ్చితార్థం జరిగిపోయింది అని ఫిక్స్ అయిపోవచ్చు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, వీళ్లిద్దరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరి లో జరగబోతున్నట్టు సమాచారం.
ఇక రష్మిక లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం విషయానికి వస్తే, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, రష్మిక అద్భుతంగా నటించింది, కానీ డైరెక్షన్ , టేకింగ్ విషయం లో కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యేదని విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా డీసెంట్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకుంది. నేడు కూడా మార్నింగ్ షోస్ మంచి ఆక్యుపెన్సీ తో మొదలయ్యాయి. ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.