Parijat Plant: ప్రతి ఇంట్లో సంతోషకరమైన వాతావరణము ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఒక ఇల్లు సంతోషంగా ఉండాలంటే లక్ష్మీదేవి కొలువై ఉండాలి. లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఇంటి పరిశుభ్రత కచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా ఇంటి చుట్టుపక్కల కూడా సరైన, స్వచ్ఛమైన వాతావరణం కలిగి ఉండాలి. ఈ వాతావరణం కలిగి ఉండడానికి లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని చెట్లను పెంచాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన చెట్లలో పారిజాతం చెట్టు ఒకటి. ఈ చెట్టును చాలామంది చూస్తూ ఉంటారు. కానీ ఈ చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది అన్న విషయం చాలామందికి తెలియదు. అంతేకాకుండా పారిజాతం చెట్టు ఇంట్లో ఉండడం వల్ల ఎలాంటి శుభాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం..
పురాణ కథల ప్రకారం.. ఇంద్రలోకం నుంచి శ్రీకృష్ణుడు పారిజాతం చెట్టును తీసుకొచ్చి సత్యభామ కు ఇచ్చారని చెబుతున్నారు. అప్పటినుంచి పారిజాతం పుష్పం ప్రత్యేకతను కలిగి ఉంది. పారిజాతం చెట్టు ఇంటి వద్ద ఉంటే ఇంట్లోకి లక్ష్మి అడుగుపెట్టడానికి ఏమాత్రం సంకోచించదని కొందరు ఆధ్యాత్మిక నిపుణులు తెలుపుతున్నారు. అయితే పారిజాతం చెట్టు ఇంట్లో ఎటువైపు ఉండాలంటే.. ఒక ఇంటికి ప్రధాన ద్వారానికి ఈశాన్యం వైపు పారిజాతం చెట్టు ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఇటువైపు నుంచి వచ్చే గాలి పారిజాతం చెట్టు మీద నుంచి ఇంట్లోకి వస్తుందని అంటారు. అంతేకాకుండా రాత్రి సమయంలో పారిజాతం పుష్పాలు ఎంతో సువాసనను కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ పారిజాతం చెట్టు తులసి చెట్టు వద్ద ఉండటం వల్ల మరింత శుభం కలిగే అవకాశం ఉందని అంటుంటారు. అందువల్ల పారిజాత వృక్షమును ఈశాన్యం లేదా తూర్పు, ఉత్తరం వైపు ఎక్కడైనా ఉంచుకోవచ్చని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా పారిజాత పుష్పాలతో దేవుళ్లను పూజించడం వల్ల ఎంతో సంతోషంగా ఉంటారని అంటుంటారు. ముఖ్యంగా శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి, దుర్గాదేవి పూజలో కచ్చితంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. వీటిని ఉపయోగించి పూజ చేయడం వల్ల స్వామివారి లేదా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు అని అంటుంటారు.
పారిజాతం వృక్షం వల్ల సువాసన రావడమే కాకుండా ఈ పుష్పాలను వేడి నీటిలో వేసుకొని తాగడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతాయని కొందరు ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పారిజాతం చెట్టుకు సంబంధించిన ఆకులు, కొమ్మలతో కూడా మలేరియా వ్యాధిని నివారించవచ్చని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాస్తు ప్రకారం ఇంట్లో పారిజాతం చెప్తూ ఉండటం వల్ల ఇంట్లో నెగెటివిటీ మాయమై పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు. ఇంట్లో వాళ్ళ మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటే పారిజాతం చెట్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని కొందరు చెబుతూ ఉంటారు. పారిజాతం జట్టు ఉండటం వల్ల ఆరోగ్యంగా కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొంటారు. కుటుంబంలో మధ్య విభేదాలు ఉంటే పారిజాతం చెట్టు వల్ల వచ్చే వాతావరణంతో తొలగిపోతాయని చెబుతారు. అలాగే సంపద వృద్ధి చెందాలంటే కూడా ఈ చెట్టు ఇంట్లో ఉండాలని కొందరు చెబుతుంటారు.