Parenting Tips: ప్రస్తుత కాలంలో పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు పెద్ద ప్రయాసగా మారిపోయింది. ఒకప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని పిల్లలు పెరిగేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ ఇదే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఈ పొరపాట్లు పిల్లల జీవితాల పై ప్రభావం పడి వారి భవిష్యత్తును ఆందోళనలో పడేస్తున్నాయి. అయితే చాలామంది తల్లిదండ్రులు 70-10-20 ఫార్ములాను పాటించాలని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఫార్ములా ప్రకారం వారిని గైడెన్స్ చేస్తే వారు కచ్చితంగా ప్రయోజకులుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ 70 – 10- 20 ఫార్ములా ఏంటి?
ముందుగా 70 గురించి చెబుదాం.. మీరు ఎప్పుడైనా మీ పిల్లవాడు తప్పు చేస్తే ఎలా స్పందిస్తారు? ఉదాహరణకు అతడు ఒక గ్లాస్ ను పగలగొట్టాడు అని అనుకుందాం. అప్పుడు మీరు ఎలా అంటారు? గ్లాస్ ఎందుకు పగలగొట్టావ్? అని అంటారు. దానికి ఆ పిల్లవాడు సమాధానం చెబితే ఓకే. కానీ కొందరు తల్లిదండ్రులు మాత్రం గ్లాస్ పగలగొట్టిన తర్వాత.. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావ్ .. అంతకుముందు కూడా ఇలాగే గ్లాసులు పగలగొట్టావ్.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులే చేస్తావ్.. అంటూ వారిస్తారు. దీనిని 100% నెగెటివిటీ అంటారు. ఎందుకంటే ఒక పిల్లవాడు చేసిన తప్పు కంటే ముందు, తర్వాత చేసే తప్పులను వారికి గుర్తు చేస్తారు. దీంతో వారి మనసులో అవమానపు ముద్ర పడిపోతుంది.
అయితే అలా ఒక పిల్లవాడు గ్లాస్ పగలకొడితే.. నువ్వు అన్ని పనులు బాగానే చేస్తావ్.. అంటే ఇక్కడ 70% వరకు మెచ్చుకుంటున్నారు. కానీ గ్లాసును చేతిలో పట్టుకున్నప్పుడు ఎందుకు అజాగ్రత్తగా ఉంటావు? అంటే 10% నెగటివ్ గా అతని తప్పును ఎత్తిచూపుతున్నారు.. భవిష్యత్తులో ఇలా అజాగ్రత్తగా ఉండకుండా చాలా జాగ్రత్తగా పట్టుకో… అని చెప్పడం 20% పాజిటివ్.
ఇలా ఒక విషయాన్ని మూడు రకాలుగా పిల్లవాడికి చెప్పడం వల్ల అతడు తల్లిదండ్రుల నుంచి ఏ విషయాన్ని అయినా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటాడు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా తను చేసే తప్పుపై ఆలోచిస్తాడు. ముఖ్యంగా తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ బాగా ఏర్పడి ఎప్పుడైనా తప్పు చేస్తే వెంటనే తన తప్పు గురించి చెప్పి దానిని ఎలా పరిష్కరించుకోవాలో అడగగలుగుతాడు. అలాకాకుండా ఒక తప్పు పై పిల్లాడిని ప్రతిసారి నిందించడం వల్ల అతడిలో నెగటివ్ ముద్ర ఏర్పడి భవిష్యత్తులో ఏదైనా తప్పు చేస్తే దానిని దాచి ఉంచే ప్రయత్నం చేస్తాడు. అలా చేయడంవల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు ఇద్దరికీ నష్టమే జరుగుతుంది. అయితే ఇకనుంచి మీరు తల్లిదండ్రులు అయితే ఈ ఫార్ములాను కూడా ఉపయోగించి చూడండి. రిజల్ట్ ఎలా వస్తుందో మీరే గమనిస్తారు.