Shivamarugan: సముద్రంను చూస్తేనే భయం వేస్తుంది. కానీ అందులో ఈత కొట్టాలని ఎవరైనా అనుకుంటారా..? ఎంతటి గజ ఈతగాళ్లయిన సముద్రపు అలల తాకిడికి తట్టుకోలేరు. ఒకవేళ తప్పిదారి సముద్రంలో పడితే ఇక ప్రాణాలను వదులుకోవాల్సిందే. కానీ ఒక యువకుడు 26 గంటలపాటు సముద్రంలో ఈదుతూ ఉన్నాడు. తాను సముద్రంలో ఉన్నప్పుడు జల్లి చేపలు తన శరీరాన్ని కొరికాయి. దీంతో తన ప్రాణం పోయింది అని అనుకున్న ఆయనకు సూర్య రష్మి కనిపించగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. అయినా కూడా చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడంతో తన కుటుంబ సభ్యులకు దూరమవుతున్నారని.. తన ప్రాణం పోతుందని అనుకున్న అతడికి మరో జన్మ వచ్చినట్లు అయింది. ఎందుకంటే అతడి చివరి ప్రాయంలో కొందరు మత్స్యకారులు కాపాడారు. అసలు ఈ యువకుడు సముద్రంలో ఎందుకు పడిపోయాడు? 26 గంటలపాటు సముద్రంలో ఏం చేశాడు?
తమిళనాడు లోని తిరునల్వేరి జిల్లాలోని కూడంకుళం సమీపంలో ఉన్న చెట్టుకులం గ్రామానికి చెందిన శివమురుగన్ మత్స్యకారుడు. ఈ ఏడాది సెప్టెంబర్ 20న కన్యాకుమారిలోని చిన్న ముట్టం పోర్టు నుంచి తన సోదరులు, ఇతర మత్స్యకారులతో కలిపి మొత్తం 16 మంది చేపలు పట్టడానికి మోటార్ బోటులో ఉదయం 4:30 గంటల ప్రాంతంలో బయలుదేరారు. అయితే సాయంత్రం 8 గంటల సమయంలో తన పడవలో ఉన్న శివమురుగన్ ఒక్కసారిగా జారిపడి సముద్రంలో పడ్డాడు. రాత్రి సమయం కావడంతో తోటి వారికి అరుపులు వినిపించలేదు. మరోవైపు ఇంజిన్ శబ్దం ఉండడం వల్ల ఎవరిని పిలవలేకపోయాడు. దీంతో తోటి వారు అటువైపు వచ్చి పిలిచారు. కానీ శివమురుగన్ తోపాటు పడవ అలలు దాటికి మరోవైపుకు కొట్టుకుపోయింది.
చుట్టూ చీకటి.. సముద్రపు నీటిలో ఉన్న శివమరుగన్ పరిస్థితి చూస్తే ఎవరైనా భయానికి ప్రాణాలు వదులుకుంటారు. కానీ కాళ్లు చేతులు కొడుతూ కొడుకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అయినా కూడా అలలు ఎక్కువ రావడంతో మళ్లీ సముద్రపు మధ్యలోకి వస్తున్నాడు. ఇదే సమయంలో జల్లి చేపలు తన చుట్టూ చేరాయి. అవి ఒక్కొక్కటి మురుగన్ శరీరాన్ని కొరకడం ప్రారంభించాయి. దీంతో అంతకుముందు తాను విన్న ప్రకారం ఆ చేపలను తన శరీరం నుంచి తొలగించే ప్రయత్నం చేశాడు. మరోవైపు సముద్రపు నీరు నోటిలోకి వేడడంతో గొంతులో అలర్జీ ఏర్పడింది. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 21న సూర్యోదయం రాగానే కాస్త ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. కానీ ఆరోజు సముద్రపు మధ్యలో ఉండటంతో ఎవరు కనిపించలేదు. అలా ఒకరోజు మొత్తం గడిచింది. సాయంత్రం వరకు ఈత కొడుతూ ఉన్న శివమొరుగన్ కు ఇక అలసట వచ్చింది. తన ప్రాణం పోతుందన్న విషయం తనకు తెలుస్తోంది.
అయితే సెప్టెంబర్ 22వ తేదీన తెల్లవారుజామున సముద్రపు మధ్యలో ఉన్న మురుగన్ కొంతమంది మత్స్యకారుల కంటపడ్డారు. దీంతో అతనిని రక్షించి కొట్టుకు చేర్చారు. ఆ తర్వాత వైద్య చికిత్స అందించారు. దాదాపు 26 గంటల పాటు సముద్ర మధ్యలో ఉన్న శివమురుగన్ తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అది అని అంటున్నారు. అంతేకాకుండా మరోసారి సముద్రపు వైపు అడుగు పెట్టలేదని చెబుతున్నాడు. ఇలా సంఘటన జరిగిన తర్వాత తన సోదరుడు కూడా చేపల వేటకు వెళ్లలేదని ఆయన పేర్కొంటున్నాడు.