Allu Arjun: అల్లు అర్జున్ ఈ మధ్య తన రూట్ మార్చాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నాడు. అందర్నీ కలుపుకోవడం అనే కాన్సెప్ట్ ను తలకెత్తుకుని తోటి స్టార్ హీరోలతో మంచి అనుబంధం మెయింటైన్ చేస్తూ తనకు ఎవరూ శత్రువులు లేకుండా చూసుకోవడంలో ఈ జనరేషన్ లో ఎన్టీఆర్ తప్ప మరొకరు సక్సెస్ కాలేదు. ఒకప్పుడు తారక్ అంటే.. యాంటీ ఫ్యాన్స్ మీమ్స్, ట్రోలింగ్ ఎక్కువ ఉండేది.

కానీ, ఇప్పుడు తారక్ కి యాంటీ ఫ్యాన్స్ లేరు. మహేష్ తో స్నేహం, చరణ్ తో బంధం, అటు ప్రభాస్ తో సైతం పలకరింపులు, ఇటు బన్నీతో సైతం బావ అంటూ సాన్నిహిత్యం మొత్తానికి ఎన్టీఆర్ తనదైన శైలిలో తనకు అందరూ కావాల్సిన వారే, తాను అందరికి కావాల్సిన వాడినే అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు బన్నీ కూడా దీన్నే ఫాలో అవుతున్నాడు.
అఖండ ఆడియో లాంచ్ కి వచ్చినా, మిగిలిన హీరోల గురించి ఈ మధ్య ఎక్కువగా పాజిటివ్ గా మాట్లాడుతున్నా దానికి ప్రధాన కారణం.. యాంటీ ఫ్యాన్స్ ను తగ్గించుకోవాలనే ఎజెండానే. అయితే, ఈ విషయంలో బన్నీ పై మెగాభిమానులు సీరియస్ గా ఉన్నారు. మెగా అభిమానులు ఎందుకు గుస్సాగా ఉన్నారు అంటే.. . ‘అఖండ’ ఈవెంట్ లో జై బాలయ్య అంటూ బన్నీ హడావుడి చేశాడు.

కానీ గతంలో పవర్ స్టార్ అనడానికి కూడా బన్నీ ఇష్టపడలేదు. ఇక్కడే మెగాభిమానులు ఫీల్ అయ్యారు. గతంలో ఓ ఆడియో లాంచ్ లో పవన్ ఫ్యాన్స్ ‘జై పవర్ స్టార్’ అని అనాల్సిందిగా ఎంత మొత్తుకున్నా బన్నీ సీరియస్ అయ్యాడే తప్ప, జై పవర్ స్టార్ అని అనలేదు. అలాగే మరో సందర్భంలో పవన్ ఫ్యాన్స్ ఎంత మొత్తుకున్నా “చెప్పను బ్రదర్” అంటూ సెటైర్ వేశాడే తప్ప జై పవర్ స్టార్ అని మాత్రం పలకలేదు.
Also Read: అనిల్ రావిపూడి- బాలయ్య కాంబోలో ఫుల్ కామెడీ.. అంతే డోస్‌తో యాక్షన్ సీన్స్?
మరి, పవన్ కల్యాణ్ కి జై కొట్టేందుకు అడ్డు వచ్చిన ఇగో, బాలయ్య విషయంలో అడ్డు రాలేదా ? అంటూ మెగా ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. అప్పుడు అంటే, బన్నీ అందర్నీ కలుపుకు పోవాలి అనే కోణంలో లేడు. ఎన్టీఆర్ ను చూశాక, ఎన్టీఆర్ కి పెరిగిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్నాక, బన్నీ తన ఇగోను పక్కన పెట్టి.. జై బాలయ్య అనే వరకు వెళ్ళాడు.
Also Read: బాలీవుడ్ లో మల్టీస్టారర్ కి రెడీ అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్