SBI PO Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. 2,056 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రొబేషనరీ ఆఫీసర్స్ నియామకాలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఇప్పటికే వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన ఎస్బీఐ తాజాగా మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కరోనా కేసులు తగ్గడంతో అన్ని రంగాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోంది.
అక్టోబర్ 5వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ 25వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. 2021 సంవత్సరం డిసెంబర్ నెలలో ఆన్ లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీని కలిగి ఉండాలి.
డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం 750 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.