Prasanth Varma: ఒక్క మూవీతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. హనుమాన్ ఆయన ఇమేజ్ వంద రెట్లు పెంచింది. హనుమాన్ చిత్ర విజువల్స్, మేకింగ్, కథ కథనాల విషయంలో ప్రశాంత్ వర్మని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్టార్ హీరోలు కూడా ఆయన వెనకబడే పరిస్థితి ఉంది. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ రూ. 270 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మూడు వందల కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అంటున్నారు. తేజ సజ్జా వంటి ఒక యంగ్ హీరో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఊహించని పరిణామం.
కేవలం కంటెంట్ ఆధారంగా హనుమాన్ మూవీకి ఈ రేంజ్ ఆదరణ దక్కుతుంది. హనుమాన్ విడుదలై మూడు వారాలు ముగిసినా థియేటర్స్ వద్ద ఆడియన్స్ సందడి తగ్గలేదు. అంతగా సినిమా ప్రేమికుల మనసు ఈ సినిమా దోచేసింది. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన క్వాలిటీ విజువల్స్ రాబట్టిన ప్రశాంత్ వర్మ హాట్ టాపిక్ అయ్యాడు. భారీ బడ్జెట్ చిత్రాల దర్శకులు ప్రశాంత్ వర్మ నుండి చాలా నేర్చుకోవాలనే టాక్ వినిపిస్తుంది.
హనుమాన్ సక్సెస్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మకు భారీ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. ఒకరైతే ఏకంగా రూ. 1000 కోట్ల ఆఫర్ ఇచ్చాడట. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. హనుమాన్ మూవీ విడుదల తర్వాత నాకు రూ. 100, రూ. 200 కోట్ల సినిమా ఆఫర్స్ వచ్చాయి. వెయ్యి కోట్ల ఆఫర్ కూడా వచ్చింది. ఓ ఎన్నారై ఫోన్ చేసి భారతీయ ఇతిహాసాల ఆధారంగా హనుమాన్ లాంటి చిత్రం చేస్తాను అంటే… రూ. 1000 కోట్లు పెట్టడానికి నేను సిద్ధం, అన్నారు.
అయితే ఇక్కడ బడ్జెట్ ముఖ్యం కాదు. బడ్జెట్ కి మించిన క్వాలిటీ విజువల్స్ ఇవ్వాలి. నేను రూ. 10 కోట్లతో సినిమా తీస్తే రూ. 50 కోట్ల బడ్జెట్ సినిమాలా ఉండేలా చూసుకుంటాను. రూ. 50 కోట్లు పెడితే రూ. 140 కోట్ల బడ్జెట్ లా ఉండేలా తెరకెక్కిస్తాను. నేను చెప్పిన బడ్జెట్ లో మూవీ చేయను. ఆ విషయం నిర్మాతకు కూడా చెబుతాను, అని చెప్పుకొచ్చాడు. మరి వెయ్యి కోట్ల ఆఫర్ అంటే రాజమౌళిని కూడా ప్రశాంత్ వర్మ దాటేసినట్లు అయ్యింది. ఇప్పటి వరకు రాజమౌళికి కూడా ఇంత పెద్ద ఆఫర్ రాలేదు.
Web Title: 1000 crores offer with hanumans success prashant varma gave a shock to rajamouli
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com