Homeఅంతర్జాతీయంUS Immigration Officials: నర్సును చంపిన ఇమిగ్రేషన్‌ అధికారులు.. అంటుకున్న అమెరికా

US Immigration Officials: నర్సును చంపిన ఇమిగ్రేషన్‌ అధికారులు.. అంటుకున్న అమెరికా

US Immigration Officials: అగ్రరాజ్యం అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఓ ఐదేళ్ల చిన్నారిని అరెస్టు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. అక్రమంగా ఉంటుందన్న కారణంతో అరెస్టు చేశారు. తాజాగా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) సహా ఫెడరల్‌ ఏజెంట్లు కాల్చి ఒక 37 ఏళ్ల వ్యక్తిని చంపేశారు. ఈ ఘటన స్థానిక పోలీసులు, ఫెడరల్‌ అధికారుల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. మరోవైపు ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
అమెరికా అధ్యక్షుడు రాష్ట్రపతి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టిన కఠిన ఇమ్మిగ్రేషన్‌ చర్యల నేపథ్యంలో, శనివారం మినియాపొలిస్‌లో ఐసీఈ (అమెరికా ఇమ్మిగ్రేషన్‌ – కస్టమ్స్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌) అధికారులు 37 ఏళ్ల అమెరికన్‌ పౌరుడిని కాల్చి చంపారు. ఈ సంఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బాధితుడు ఎవరు?
చనిపోయినవాడు అలెక్స్‌ జెఫ్రీ ప్రెట్టి. మినియాపొలిస్‌కు చెందిన ఐసియూ నర్స్‌. అతను పూర్తి అమెరికన్‌ పౌరుడు, నేర చరిత్ర లేని వ్యక్తి. చట్టపరమైన ఆయుధ లైసెన్స్‌ కలిగి ఉన్నాడు. ఐసీఎ అధికారులు ’ఆయుధంతో దాడి చేస్తూ సమీపించాడు’ అని చెప్పినా, వైరల్‌ వీడియోలో అలాంటి దృశ్యం లేదు.

మూడు వారాల్లో రెండో ఘటన..
ఇది మినియాపొలిస్‌లో మూడు వారాల్లో జరిగిన రెండో ఐసీఈ కాల్పులు. జనవరి 7న రెనీ నికోల్‌ గుడ్‌ (37)ను కూడా ఐసీఎ బలగాలు కారు చంపాయి. అధికారులు ’వాహనాన్ని ఆయుధంగా ఉపయోగించింది’ అని సమర్థించుకున్నారు. సంఘటన వివరాలు వెలుగులోకి వచ్చాక, స్థానికుల్లో కోపం కట్టలు తెంచుకుంది. వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఐసీఏ వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మినసోటా నుంచి భద్రతా బలగాలు వెనక్కి తిరగాలని డిమాండ్‌ చేశారు.

నిరసన అణచివేత..
మినియాపొలిస్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ‘ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలి, నిరసనలు చేపట్టొద్దు’ అని పోలీసులు తెలిపారు. అయినా నిరసనలు ఆగకపోవడంతో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. మరోవపు ట్రంప్‌ ఐసీఎ చర్యలను సమర్థించుకుని, మినసోటా డెమొక్రటిక్‌ నాయకులను ఆరోపణలు చేశారు. ‘ఆయుధం పూర్తిగా లోడ్‌ చేసినవాడు ఐసీఎపై కాల్చాలని ప్రయత్నించాడు‘ అని చెప్పారు.

వీడియోల ఆధారంగా నెటిజన్లు న్యాయం కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఇటీవలి కాలంలో మినియాపోలిస్‌లో జరిగిన మరో ఫెడరల్‌ కాల్పుల ఘటన తర్వాత వచ్చిన నేపథ్యంలో, ప్రజల్లో ఆందోళన పెరిగింది. దర్యాప్తు ఫలితాలు ఈ వివాదానికి కీలకం కానున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version