https://oktelugu.com/

Japan : ఏ పని చేయడు.. వారానికి 28 సార్లు శృంగారం.. ఇలాంటి అదృష్టవంతుడు ఎక్కడా ఉండకపోవచ్చు..!

వటనాబెకు కొందరు గర్ల్ ప్రెండ్స్ కూడా ఉన్నారు. అ విషయం భార్యలకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోరు. ఇంతటి అదృష్టం ఏ మగాడికైనా ఉంటుందా..!!

Written By:
  • Srinivas
  • , Updated On : October 20, 2024 10:57 pm
    japan

    japan

    Follow us on

    పెద్ద ఉద్యోగం.. కావాల్సినంత సంపాదన.. మంచి ఇల్లు.. ఉన్న వారికి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదు. కొన్నాళ్ల పాటు ఉద్యోగం, వ్యాపారం బిజీలో పడి 30 ఏళ్ల తరువాత పెళ్లికి రెడీ అయిన తరువాత ఇలాంటి వారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో పెళ్లికాని ప్రసాదులాగే మిగిలిపోతున్నారు. కానీ ఓ వ్యక్తికి ఎటువంటి ఉద్యోగం లేదు.. గాలికి తిరుగుతూ కాలక్షేపం తిరుగుతూ ఉండేవాడు. కానీ అతడికి ఓ గర్ల్ ప్రెండ్ తారసపడింది. కానీ అతడు ఏ పని చేయకపోవడంతో అతనిని విడిచిపెట్టింది. కానీ ఆయన బాధను చూసిన తరువాత కొంత మంది అమ్మాయిలు ఆయనను పెళ్లి చేసుకునేందుకు క్యూ కట్టారు. అలా ప్రస్తుతానికి అతనికి 4 మంది భార్యలు, 10 మంది పిల్లలతో ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఉన్న ఈ యన గురించి తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరో తెలుసా?

    సాధారణంగా ఏ అమ్మాయి అయినా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అతడు మంచి ఉద్యోగం చేస్తున్నాడా? లేదా ఆదాయం ఎలా వస్తుంది? అని చూస్తుంది.కానీ చైనాకు చెందిన కొంత మంది అమ్మాయిలు ఆయనకు ఎలాంటి ఉద్యోగం లేకపోయినా ఆయనను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. పైగా వారు ఉద్యోగాలు చేస్తూ వారి పిల్లలను చూసుకుంటూ ఉంటే చాలు అని అవకాశం ఇచ్చారట. అంతేకాకుండా వారానికి 28 సార్లు వారితో శృంగారంలో పాల్గొంటూ ఆనందంగా ఉంటున్న ఈయన పేరు వటనాబె.

    జపాన్ దేశంలోని హోక్కాయిడో ఐలాండ్ కు చెందిన వటనాబె 10 ఏళ్లుగా ఎటువంటి ఉద్యోగం చేయకపోయినా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అతని స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఆరేళ్ల కిందట వటనాబెకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అయితే వటనాబె ఏ పని చేయకపోవడంతో అతడిని విడిచిపెట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన బాధనంతా చెప్పుకుండూ ఓ డేటింగ్ యాప్ లో తన వివరాలను వెల్లడించారు. దీంతో కొంత మంది అమ్మాయిలు అతనిపై సింపతి చూపిస్తూ అతనిని పెళ్లి చేసుకుంటున్నారు.

    అలా గత ఆరేళ్లలో వటనాబె 4 పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన అదృష్టం ఎలా ఉందంటే.. అతనిని భార్యలు ఏ పని చేయనివ్వడం లేదు. ఇంట్లో ఉండి వంట చేస్తూ పిల్లలను చూసుకుంటే చాలు అని అంటున్నారు. వారు ఉద్యోగం చేసి సంపాదిస్తున్నారు. అయితే వటనాబె ఇంట్లో ఖర్చు నెలకు రూ. 5 లక్షల వరక అవుతుంది. ఈ సంపాదనంతా అతని భార్యలే తేవడం గమనార్హం.

    వటనాబెకు ఉన్న మరో అదృష్టం ఏంటంటే అతని భార్యలకు విడివిడిగా భార్యలకు బెడ్ రూంలు ఉన్నాయి. రోటేషన్ పద్దితిలో వారి రూముల్లోకి వెళ్లి కలిసి ఉంటాడు. అయితే ఎవరూ ఎలాంటి ద్వేషాలు లేకుండా వటనాబెను అందరూ సమానంగా పంచుకుంటారు. అయితే వటనాబెకు కొందరు గర్ల్ ప్రెండ్స్ కూడా ఉన్నారు. అ విషయం భార్యలకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోరు. ఇంతటి అదృష్టం ఏ మగాడికైనా ఉంటుందా..!!