Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్.. ప్రపంచానికి అంతటికీ సుపరిచితమైన పేరు. రష్యా అధ్యక్షుడిగా దశాబ్ద కాలంగా ఉన్నారు. ఇక మూడేళ్లుగా ఉక్రెయిన్‌తో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. భారత్‌కు మంచి మిత్రుడు అయిన పుతిన్ నవంబర్‌లో భారత పర్యటనకు వచ్చారు. ఇక యుద్ధం నేపథ్యంలో నాటో దేశాలు, అమెరికా రష్యాపై ఆంక్షలు విధించాయి. కానీ భారత రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తోంది. మిత్ర దేశం కోసం భారత్ అమెరికా విధించిన 50 శాతం సుంకాలను భరిస్తోంది. ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై తాజాగా డ్రోన్ దాడి జరిగింది. ఉక్రెయిన్ జరిపిన దాడిగా రష్యా ఆరోపిస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నోవో–ఒగార్యోవో.. పాలనా కేంద్రం..
మాస్కో ప్రాంతంలోని ఒడింత్సోవో వద్ద గ్రామీణ ప్రాంతంలో పుతిన్ అధికారిక నివాసం ఉంది. రోజువారీ నిర్ణయాలు, ఉన్నత సమావేశాలు, డిజిటల్ సమావేశాలు ఇక్కడే జరుగుతాయి. చుట్టుముట్టిన గట్టి గోడలు, అత్యాధునిక కెమెరాలు, పర్యవేక్షణ , పరికరాలు ఈ ప్రదేశాన్ని రక్షిస్తాయి.
సరస్సు ఒడ్డున రాజ భవనం..
నోవ్గోరోడ్ ప్రాంతంలో వల్దాయ్ సరస్సు ఒడ్డున 250 హెక్టార్ల విస్తీర్ణంలో ’ఆబ్జెక్ట్ 201’ అనే కోడ్‌తో పిలవబడే ఈ స్థలం ఉంది. 80కి పైగా భవనాలు, 3,500 చదరపు మీటర్ల ప్రధాన రాజభవనంతో పాటు మినీ గేమింగ్ హాల్, ఐష్వర్య భోజనశాలలు, సినిమా హాల్, గోల్ఫ్ ప్రదేశాలు ఉన్నాయి. గాలిలో పెరిగే ముప్పులకు అత్యాధునిక రక్షణ వ్యవస్థలు, ఇటీవల ఉక్రెయిన్ నుంచి 91 దూరపు డ్రోన్ దాడులను అడ్డుకున్నట్లు రష్యా సమాచారం.
బోచరోవ్ రుచేయ్…
క్రాస్నోదార్ ప్రాంతంలోని సోచి సమీపంలో ఈ నివాసం వేసవి కాలంలో పుతిన్ ప్రసంగించే ప్రధాన ప్రదేశం. ఇటీవల డ్రోన్ ప్రమాదాల కారణంగా ఆయన ఇక్కడికి సందర్శనలు తగ్గించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
రహస్య నివాసాలు..
అధికారిక స్థలాలతోపాటు పుతిన్‌కు బహుళ రహస్య ఆస్తులు ఉన్నాయని అంచనా. గెలెండ్జిక్‌లోని ’పుతిన్ ప్యాలెస్’ బ్లాక్ సీ తీరంలో విశాలంగా వ్యాపించి, బిలియన్ డాలర్ల ఖర్చుతో ఐష్వర్య సౌకర్యాలతో కూడినది. ఫెడరల్ రక్షణ సిబ్బంది, నో ఫ్లై ఏరియా దీన్ని కాపాడుతాయి, అయినప్పటికీ క్రెమ్లిన్ ఖండిస్తోంది.
క్రిమియాలోని కేప్ అయాలోలో కూడా 127 మిలియన్ డాలర్ల లగ్జరీ రాజభవనం, భూగర్భ ఆశ్రయాలు, అడవి మధ్య రహస్య కొట్టగూళ్లు, రహస్య సొరంగాలు ఉన్నట్లు యాంటీ కరప్షన్ సంస్థలు గుర్తించాయి. ఈ నెట్‌వర్క్ అత్యవసరాల్లో పుతిన్‌ను రక్షించడానికి రూపొందించినట్లు తెలుస్తోంది.