India UNSC Seat: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. త్వరలో భారత్‌లో తమ కంపెనీని లాంచ్ చేసేందు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ చివరి వారంలో భారత్‌కు రాబోతున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో తమ పెట్టుబడులపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద కార్ల మార్కెట్‌గా ఉన్న భారత్‌లో కంపెనీ నెలకొల్పేందుకు అనే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో తాజాగా ఆయన ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు వీటో కల్పించాలని ప్రతిపాదించారు. భారత్‌కు యూఎన్‌ఎస్సీలో శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇటీవల ప్రస్తావించిన విషయం తెలిసింది.
అమెరికా స్పందన ఇదీ..
మస్క్ ప్రతిపాదనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భద్రతా మండలి సహా, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమే అని ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పస్టం చేశారు. ఈమేరకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని సారాంశం ఇలా ఉంది ‘‘ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్ గతంలో సర్వ ప్రతినిధి సభలో మాట్లాడారు. విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతు తెలిపారు. భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సంస్థల్లో సంస్కరణలకు మేం ఎప్పుడూ అనుకూలమే. ఐక్యరాజ్యసమితి ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలి’’ అని తెలిపింది.
భారత్‌తోపాటు పలు దేశాలకు ప్రతినిధ్యం..
ఇదిలా ఉండగా యూఎన్‌ఎస్‌లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని మస్క్ జనవరిలో వ్యాఖానించారు. అత్యధిక జనాభా ఉన్న దేశానికి ప్రాతినిధ్యం లేకపోవడాన్ని తప్పు పట్టారు. ఆఫ్రికా దేశాలన్నింటికీ కలిపి కూడా ప్రతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వర్ధమాన దేశాల ప్రయోజనాలు కాపాడేందుకు సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిన అవసరం ఉందని భారత్ సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తూ వస్తోంది. దీనికి అంతర్జాతీయ సమాజం సైతం మద్దతు ఇస్తుంది.
ప్రస్తుతం ఇలా..
ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రస్తుతం 15 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంటుంది. వీటిలో చైనా, యూకే, ఫ్రాన్స్, రష్యా, అమెరికాకు శాశ్వత సభ్యత్వం పేరిట వీటో అధికారం ఉంది. మరో పది దేశాలకు రెండేళ్ల కాలపరిమితితో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికవుతూ ఉన్నాయి. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కోసం చర్యలు తీసుకుంటామని ఇటీవల విడుదలైన బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.