spot_img
Homeఅంతర్జాతీయంUS Iran war impact on global economy: అమెరికా-ఇరాన్‌ యుద్ధం.. అమెరికా అర్థిక వ్యవస్థ...

US Iran war impact on global economy: అమెరికా-ఇరాన్‌ యుద్ధం.. అమెరికా అర్థిక వ్యవస్థ తలకిందులు!

US Iran war impact on global economy: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అన్నట్లుగా మారింది అమెరికా పరిస్థితి. వెనెజువెలా తరహాలో ఇరాన్‌ కథ వారం రోజుల్లో ముగిస్తామన్న అహంకారంతో ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధం మొదలు పెట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక తంటాలు పడుతున్నారు. యుద్ధం నుంచి గౌరవంగా తప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు. ఒకవైపు యుద్ధం.. ఇంకోవైపు గల్ప్‌ దేశాల ఒత్తిడి మరోవైపు కుప్పకూలుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ.. ఇలా మొత్తం ట్రంప్‌ అంచనాలు తలకిందులయ్యాయి. అయినా ఎక్కడా తగ్గడం లేదు. పైగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు.

యుద్ధం మొదలు ఇలా..
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై దాడులు చేపట్టిన తర్వాత, ఈ యుద్ధం ప్రస్తుతం కాల్పుల విరమణ దశలో ఉంది. ఇరాన్‌ ప్రతీకారంగా గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా స్థావరాలు, కమాండ్‌ సెంటర్లు, విమాన నిల్వలు, రాడార్‌లపై దాడి చేసింది. అమెరికా తన అధునాతన గగన రక్షణ వ్యవస్థలను ప్రదర్శించినా, ఇరాన్‌ పాత ఎఫ్‌–5 విమానాలతో ఆశ్చర్యకరంగా పోరాడింది. రెండు వైపులా నష్టాలు తీవ్రంగా ఉన్నప్పటికీ, యుద్ధం ఆగుతుందా, చర్చలు జరుగుతాయా అనేవి ఇంకా స్పష్టత లేకుండా ఉన్నాయి.

అగ్రరాజ్యానికి గట్టి దెబ్బ..
అమెరికా ఇరాన్‌ సైనిక శక్తిని బలహీనపరిచామని ప్రకటించినా, అంతర్జాతీయ మీడియా ఇరాన్‌ అమెరికాకు గట్టి దెబ్బ తీసినట్లు కథనాలు ప్రచురించాయి. యూఎస్‌ నష్టాల కచ్చితమైన అంకెలు బయటపడలేదు, దీనిపై ట్రంప్‌ పరిపాలనకు సొంత పార్టీ నేతలు కూడా అసంతప్తి తెలిపారు. ఇరాన్‌ దాడులు అమెరికా రక్షణ వ్యవస్థలను పరీక్షించాయి, మరియు రెండు వైపులా పునర్నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగాయి.

బడ్జెట్‌ భారం.. దీర్ఘకాలిక ప్రభావాలు
యుద్ధం మొదటి వారంలోనే అమెరికా 11 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది, పెంటగాన్‌ 200 బిలియన్‌ డాలర్లకు పైగా అదనపు నిధులు కోరింది. ట్రంప్‌ ప్రతిపాదించిన 1.5 ట్రిలియన్‌ డాలర్ల రక్షణ బడ్జెట్‌ మునుపటి సంవత్సరానికి 50 శాతం ఎక్కువ. దెబ్బతిన్న స్థావరాల మరమ్మత్తుకు మరో అనేక బిలియన్ల అవసరం, ఇది ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ ఖర్చులు యుద్ధాన్ని ఆపడానికి ఒత్తిడి తీసుకొస్తాయా అనేది చూడాలి.

అమెరికా ఇరాన్‌ను చర్చలకు బలవంతం చేయాలని భావిస్తున్నా, ఇరాన్‌ ప్రతిఘటన ఆ ఆశలను వమ్ము చేస్తోంది. కాల్పుల విరమణ తాత్కాలికంగా కనిపించినా, రాజకీయ ఒత్తిడి, ఆర్థిక నష్టాలు చర్చలకు మార్గం తీసుకొస్తాయి. అయితే, పారదర్శకత లేకపోవడం అమెరికా లోపాలను బహిర్గతం చేస్తోంది. ఈ ఘర్షణ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసి, గల్ఫ్‌ దేశాల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. భవిష్యత్తులో శాంతి కుదరొచ్చు లేదా మళ్లీ దాడులు జరగొచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular