US helicopter crash Strait of Hormuz: అమెరికా, ఇరాన్ యుద్ధ కారణంగా హర్మూజ్ జలసంధికి ప్రపంచవ్యాప్తగా గుర్తింపు దక్కింది. అందరి నోళ్లలో నానుతోంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా అయ్యేది ఇక్కడి నుంచే. యుద్ధం కారణంగా ఇరాన్ మొదట దీనిని మూసివేసింది. తర్వాత అమెరికా పట్టు సాధించింది. తాజాగా ఈ జలసంధి వద్ద భారత నౌకపై అమెరికా సైనికులు దాడి చేశారు. ఇలాంటి ఒమన్ నౌకలో ఉన్న 20 మంది భారత సిబ్బందిని కాపాడింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే హర్మూజ్ వద్ద అమెరికా గస్తీ మెలికాప్టర్ కుప్పకూలింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైనా ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.
ఇరాన్ దిగ్బంధం తొలగించేందుకు..
ఇరాన్ విధించిన జలసంధి దిగ్బంధనాన్ని తొలగించడానికి అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ కార్యాచరణలో అపాచీ హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, డ్రోన్లు కలిసి నిరంతర పహారా కాస్తున్నాయి. ఈ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.
ఏం జరిగింది?
అయితే హెలికాప్టర్ కూలడానికి కారణం ఏమిటి అన్నది ఎవరూ ప్రకటించలేదు. ఇరాన్ మాత్రం తన దళాలు అమెరికా రీపర్ డ్రోన్లను కూల్చివేశాయని ప్రకటించింది. దీంతో అపాచీ హెలికాప్టర్ ఇరాన్ క్షిపణి దాడికి గురై కూలిందా లేదా ఏదైనా సాంకేతిక లోపం వల్ల పతనమైందా అనే అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఫిబ్రవరి నుంచి అమెరికా–ఇరాన్ మధ్య ఘర్షణలు మొదలైనప్పటి నుంచి కూలిన మొదటి సైనిక హెలికాప్టర్ ఇదే.
ఇరాన్ సైన్యం పూర్తిగా నాశనం..
అమెరికా–ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన దాడుల వల్ల ఇరాన్ సైనిక బలాలు సమూలంగా నాశనమయ్యాయని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం టెహ్రాన్ వద్ద కేవలం 21 శాతం మాత్రమే క్షిపణి సామర్థ్యం మిగిలి ఉందని చెప్పారు. మళ్లీ ఇరాన్ దాడులు ప్రారంభిస్తే అమెరికా సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నాహాలతో ఉందని హెచ్చరించారు.
యుద్ధం కారణంగా అమెరికా తీవ్రంగా నష్టపోయింది. ఈ విషయాన్ని సెంట్రల్ కమాండ్ స్వయంగా అంగీకరించింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 13 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, 399 మంది గాయపడ్డారు. అనేక యుద్ధ విమానాలు కూడా కూల్చివేయబడ్డాయి.
