US targets India: ట్రంప్ పాలిటిక్స్‌లో కొత్త మలుపు ఇది. వెనుజువెలాలోకి అమెరికా సైనికులను పంపించి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో ఆ దేశంలోని చైనా, రష్యా డిఫెన్స్ సిస్టం విఫలమయ్యాయి. దీంతో అమెరికా ఆపరేషన్ విజయవంతమైంది. దీంతో ట్రంప్‌కు అహంకారం తలకెక్కింది. దీంతో క్యూబా, ఇరాన్, కొలంబియా, మెక్కికోతోపాటు భారత్‌ను టార్గెట్ చేశారు.
వెనెజువెలా ఆపరేషన్ సక్సెస్..
వెనెజువెలాలో మదురో దంపతులను లక్ష్యంగా చేసుకుని యుఎస్ విజయవంతమైంది. రష్యా ఎస్–300, చైనా రాడార్లు అమెరికా చొరబాటును పసిగట్టలేకపోయాయి. దీంతో యుఎస్ ఆయుధాల ఆధిపత్యాన్ని నిరూపించింది. ఈ సంఘటన ఆయిల్ వనరులపై యుఎస్ ఆకాంక్షలను స్పష్టం చేస్తోంది. వెనుజువెలాలోని 303 బిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను తరలించుకుపోవడానికి యుఎస్ కంపెనీలను ట్రంప్ ప్రోత్సహిస్తున్నారు. వెనుజువెలాలో విజయం తర్వాత ట్రంప్ ఇప్పుడు మరో ఐదు దేశాలపై ఫోకస్ పెట్టాడు.
ఐదు దేశాలపై లక్ష్యాలు
మొదటి టార్గెట్ క్యూబా..
వెనెజువెలాపై ఆధారపడి ఉన్న క్యూబాను త్వరగా కూల్చివేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఆయిల్ సరఫరాలు ఆగిపోతే ఇది సులభమవుతుందని వ్యూహం. అందుకే క్యూబాను ఫస్ట్ టార్గెట్ చేశారు. క్యూబాకు చెందిన మచాడో కూడా అమెరికాకు మద్దతు ఇస్తున్నారు.
ఇరాన్, కొలంబియా..
ఇరాన్‌పై మునుపటి దాడుల్లోనూ రష్యన్ టెక్నాలజీ విఫలమైంది. కొలంబియా అధ్యక్షుడు పెట్రోతో మాటల యుద్ధం ఉధృతమైంది. ఈ దేశాల్లో పాలన మార్పులు లక్ష్యంగా యుఎస్ ఒత్తిడి పెరుగుతోంది. కానీ పెట్రో బలంగా నిలబడ్డారు. ట్రంప్‌కు సవాల్ చేస్తున్నారు. అయితే కొలంబియా మెక్సికో పక్కనే ఉంది. అందుకే దానిని కూడా ఆక్రమించి చూస్తున్నారు. అమెరికా కోర్టుల ప్రకారం ఇవి తప్పు చేస్తున్నాయి కాబట్టి అక్కడి ప్రభుత్వాలను కూలుస్తామని ట్రంప్ అంటున్నారు.
మెక్సికోపై దాడి సూచన..
అక్రమ వలసలు, మాదకాలు కారణంగా మెక్సికోను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సైనిక చర్యలు ఆలోచిస్తోంది. సరిహద్దు భద్రతకు ఇది ముఖ్యమని ట్రంప్ వాదన.
గ్రీన్‌లాండ్ కోసం పట్టు..
నాటో సభ్య దేశమైన డెన్మార్క్ భూభాగం గ్రీన్‌లాండ్‌ను యుఎస్ కోరుతోంది. భద్రతా కారణాలతో ఈ డిమాండ్ ప్రపంచవ్యాప్త చర్చనీయాంశం. ఇది యుఎస్ ప్రభావాన్ని ఈ ప్రాంతంలో విస్తరించే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఇగోతో భారత్‌పై ఒత్తిడి..
ట్రంప్–మోదీ మధ్య వ్యాఖ్యలు ఉధృతమవుతున్నాయి. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు, టారిఫ్‌లు, మొక్కజొన్న వ్యాపారం విషయాల్లో యుఎస్ ఒత్తిడి పెరిగింది. షెల్ ఆయిల్ కొనుగోళ్లకు భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. భారత్ మౌనంగా ఉండి స్వంత ఆస్థాను కాపాడుకుంటోంది. యుఎస్ ఆయుధాలు అమ్మకాలకు ఈ సంఘటనలు ప్రచారం చేస్తున్నాయి. మోదీ తనను బతిమాడుతున్నాడని ట్రంప్ చెప్పుకుంటున్నారు.