US troops in Bangladesh: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌కు మిత్రులు, శత్రువులు ఎవర్న స్పష్టత వచ్చింది. ఇదే సమయంలో మన సైనిక శక్తి కూడా ప్రపంచానికి తెలిసింది. ఈ నేపథ్యంలో పూర్తిగా స్వదేశీ ఆయుధాల తయారీపై కేంద్రం దృష్టిపెట్టింది. ఇప్పుడు ఉన్న ఆయుధాలతోపాటు మరిన్ని కొత్త ఆయుధాలు రూపొందిస్తోంది. ఇదే సమయంలో మన త్రివిధ దళాల(ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ)ను సన్నద్ధం చేస్తోంది. ఇటీవల పాకిస్తాన్–పంజాబ్ సరిహద్దు సర్‌క్రీక్ ప్రాంతంలో అత్యంత విస్తృతమైన సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. వీటితోపాటు, ఈశాన్య భారతంలో గువాహతి సమీపంలోని సిలివిరి కారిడార్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూడ విన్యాసాలు గట్టి వేగంతో జరుగుతున్నాయి. అలాగే, లద్దాక్–అకసై చిన్ ప్రాంతంలో కూడా సాయుధ బలగాల శిక్షణ కొనసాగుతోంది. దీన్ని భారత రక్షణ విధానంలో కీలక దశగా పరిగణిస్తున్నారు.
మయన్మార్‌లో అమెరికా విమానం..
భారత సైనిక విన్యాసాలతో ఏదో జరగబోతోంది అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా నుండి వచ్చిన ఒక సైనిక విమానం మయన్మార్–బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని రాడిసన్ వద్ద ల్యాండ్ అయ్యింది. అందులో సుమారు వంద మంది సైనికులున్నారు. ప్రస్తుతం ఈ విమానం మయన్మార్ సైన్యానికి మద్దతుగా వచ్చిందా.. లేక మణిపూర్ తీవ్రవాదులతో సంబంధం ఉండొచ్చన్న అనుమానాలు వెలుగులోకి వచ్చాయి.
బంగ్లాదేశ్‌లో అజర్‌బైజాన్ విమానం..
ఇక ఇదే సమయంలో భారత మిత్రదేశం ఆర్మేనియాకు శత్రు దేశం అయిన అజర్‌బైజాన్‌కు చెందిన ఓ కార్గో విమానం కూడా తాజాగా బంగ్లాదేశ్‌లో ల్యాండ్ అయింది. ఈ విమానం ఎందుకు వచ్చిందో కూడా తెలియడం లేదు. కానీ అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ రెండు విమానాల రాక భద్రతా పరిస్థితుల్లో కొత్త మలుపు తీసుకొస్తున్నట్లు సూచిస్తున్నాయి.
ప్రాంతీయ భద్రతా సవాళ్లు..
ఈ విన్యాసాలు, విదేశీ సాయుధ ఉనికిని, వాహనాలు ప్రదేశంలోకి వెళ్లడమూ, భారత్‌లో సాంఘిక, భౌగోళిక సవాళ్ల సంక్లిష్టతను పెంచుతోన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో సరిహద్దుల దగ్గరే ఈ అన్ని చర్యలు చోటుచేసుకోవడం భారత సరిహద్దుల భద్రతను మరింతగా ప్రశ్నార్థకం చేస్తోంది.