Homeఅంతర్జాతీయంUAE good news for India Hormuz Strait: భారత్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన యూఏఈ.....

UAE good news for India Hormuz Strait: భారత్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన యూఏఈ.. ఇక హర్మూజ్‌ కష్టాలు తీరినట్లే!

UAE good news for India Hormuz Strait: పశ్చిమాసియా యుద్ధం.. గల్ఫ్‌ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనవుతోంది. ఇరాన్‌పై అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని మూసివేసింది. దీంతో యూరప్, భారత్, చైనా, జపాన్, బంగ్లాదేశ్,పాకిస్తాన్, శ్రీలంక వంటి అనేక దేశాలు ఆయిల్‌ సంక్షోభం ఎదుక్కొంటున్నాయి. ఈ పరిస్థితులను అధికమించేందుకు తంటాలు పడుతున్నాయి. మరోవైపు ఇంధన ధరలు పెంచేశాయి. ఇక ఇరాన్‌-అమెరికా మధ్య శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో హర్మూజ్‌ గుండా స్వేచ్ఛా వాణిజ్యం మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒపెక్‌ + దేశాల నుంచి బయటకు వచ్చింది యూఏఈ. స్వేచ్ఛా వాణిజ్యం చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్‌కు శుభవార్త చెప్పింది. యూఏఈ చమురు రవాణా మార్గాన్ని మార్చడం భారత్‌కు శుభసూచన. హార్మూజ్‌ జలసంధి బైపాస్‌ చేసి ఫుజైరా ద్వారా సరఫరా పెంచడం ద్వారా ఇంధన ధరలు స్థిరపడే అవకాశం ఉంది.

యూఏఈ కీలక నిర్ణయం
ఒపెక్‌+ నుంచి మే 1 నుంచి వైదొలిగిన యూఏఈ, తన చమురు రవాణాను హార్మూజ్‌కు బదులు ఫుజైరా మార్గాన్ని ఉపయోగించనుంది. హబ్జాన్‌-ఫుజైరా పైప్‌లైన్‌ ద్వారా రోజుకు 1.5 మిలియన్‌ బ్యారెళ్ల చమురు అరేబియా సముద్రానికి చేరుస్తుంది. ఇది ఇరాన్‌ ప్రభావం లేకుండా స్థిరమైన సరఫరా జరుగుతుంది.

ఫుజైరా పైప్‌లైన్‌
2012లో 4 బిలియన్‌ డాలర్ల ఖర్చుతో 380 కి.మీ. విస్తరించిన ఈ మార్గం ఒమాన్‌ గల్ఫ్‌ నుంచి ఫుజైరా ఓడరేవుకు చమురును పంపుతుంది. అక్కడి నుంచి ట్యాంకర్లు నేరుగా భారత్‌కు చేరుకుంటాయి, హార్మూజ్‌ రిస్క్‌ ఉండదు. యూఏఈ ఉత్పత్తి 2027 నాటికి 5 మిలియన్‌ బ్యారెళ్లకు చేరుతుంది.

భారత్‌కు ప్రయోజనాలు
ఏప్రిల్‌ 2026లో యూఏఈ నుంచి రోజుకు 619,000 బ్యారెళ్లు (43% పెరుగుదల) దిగుమతి చేసిన భారత్‌కు మరింత సరఫరా చేస్తుంది. మొత్తం దిగుమతి 4.4 మిలియన్‌ బ్యారెళ్లు/రోజు. దిగుమతి బిల్లు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.

ఇంధన ధరల ప్రభావం
హార్మూజ్‌ ఉద్రిక్తతలు ధరలను 85-90/బ్యారెల్‌కు పెంచాయి. ఫుజైరా మార్గం స్థిరత్వం తెస్తుంది. పెట్రోల్, డీజిల్‌ ధరలు రూ.105-110/లీ. స్థిరంగా ఉండే అవకాశం. యూఏఈ-భారత్‌ ఇంధన, వాణిజ్య, భద్రతా ఒప్పందాలు మరింత బలపడతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version