White House: గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. ఒక దాడి నుంచి అయితే తృటిలో ట్రంప్ తప్పించుకున్నారు. ఇక ఎన్నికల్లో గెలిచారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తోంది. ఈ క్రమంలో తాజాగా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్స్ గాయపడ్డారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఉగ్రవాద చర్యగా, దేశ భద్రతపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. ఈ కాల్పులు జరిపింది అఫ్గానిస్తాన్‌కు చెందిన రెహమానుల్లా లఖన్వాల్‌గా గుర్తించారు.
ఆఫ్గాన్ నుంచి వలస వచ్చి..
2021లో బైడెన్ పరిపాలన సమయంలో కోహమానుల్లా దేశంలోకి ప్రవేశించాడని ట్రంప్ తెలిపారు. అలాంటి వలసదారులపై మరింత కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరోక్షంగా బైడెన్ ప్రభుత్వ విధానాలను విమర్శించాడు. ఈ దాడికి స్పందించిన ట్రంప్ 500 మంది నేషనల్ గార్డ్ దళాలను వాషింగ్టన్ పరిధిలో మోహరించాలని ఆదేశించారు.
కాల్పుల తర్వాత భద్రతా చర్యలు
కాల్పుల్లో గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించారు. అతడు ఒంటరిగా దాడి చేశారని అధికారులు తెలిపారు. ఎఫ్‌బీఐ విచారణ తుది దశలో ఉంది. కాల్పు సమయంలో చోటుచేసుకున్న ఉగ్రదాడి వల్ల అమెరికాలో భద్రతా ఆందోళనలు పెరిగాయి. కాగా, ఈ కాల్పులు ప్రాంతీయ భద్రతా పరిణామాలలో కూడా తీవ్ర సమస్యల్ని వెలికి తీస్తున్నాయి.
ఈ ఘటన అమెరికా దేశద్రోహ వ్యతిరేక చర్యల్లో కొత్త అధ్యాయం ప్రారంభించింది. విదేశీయుల ఇమ్మిగ్రేషన్ పిటిషన్లపై నిబంధనలు ఆపకపోతే జాతీయ భద్రత ప్రమాదంలో ఉంటుంది అని ఇది సూచిస్తోంది.