Donald Trump: ప్రపంచంలో చమురు దిగుమతుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా తర్వాత ఎక్కువ మార్కెట్ ఉన్న దేశం భారతే. అందుకే పెట్రోలియం ఉత్పత్తి దేశాలు భారత్‌కు ఎగుమతి చేయడానికి చూస్తుంటాయి. భారత్ కూడా ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ దేశాలతో అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుతం రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో చమురు దిగుమతి చేసుకుని యురోపియన్ యూనియన్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫలితంగా భారత్ లాభపడుతోంది. అయితే రష్యానుంచి భారత్ చమురు దిగుమతికి చెక్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చమురు దిగుమతిని సాకుగా చూపి 25 శాతం సుంకాలు విధించారు. తాజాగా వెనెజువెలా చమురు డీల్‌లో భారత్ పాత్రపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, భారత్ ఆ చమురు దిగుమతులు పెంచనుందని ప్రకటించారు. అయితే దీనిపై భారత్ స్పందించలేదు.
వెనెజువెలా ఆయిల్‌పై ట్రంప్ కన్ను..
వెనెజువెలాలోని భారీగా ఉన్న చమురు నిల్వల కోసమే ట్రంప్ సైలెంట్ ఆపరేషన్ నిర్వహించి అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను ఎత్తుకొచ్చారు. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీరించారు. ట్రంప్ మాత్రం ‘ఆమె నా కోరికల ప్రకారం పాలిస్తోంది. చమురు మొత్తం మాకు చేరే వరకు కొనసాగుతారు‘ అని ట్రంప్ స్పష్టం చేశారు. ‘మేము వెనెజువెలాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. భారత్ కూడా చేరనుంది‘ అని ట్రంప్ తెలిపారు. చైనా కూడా చర్చల్లో ఉందని, దాన్ని స్వాగతిస్తామని చెప్పారు. వెనెజువెలా చమురు నిల్వలు పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉన్నాయని స్పష్టం చేశారు.
వెనెజువెలా రాజకీయ మలుపు
మోదీ–రోడ్రిగ్జ్ చర్చలు..
ఇదిలా ఉంటే.. ఇటీవల భారత ప్రధాని మోదీ, రోడ్రిగ్జ్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తన ఆధిపత్యం చాటుకునేందుకు భారత్‌ను బద్నాం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వెనెజువెలా చమురు కొనుగోలుతో భారత్‌కు చమురు దిగుమతులు సులభమవుతాయి. కానీ అమెరికాకు తొలొగ్గాల్సి ఉంటుంది. చైనా పాల్గొంటే గ్లోబల్ ఎనర్జీ డైనమిక్స్ మారవచ్చు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ అధికారికంగా స్పందించలేదు.