Trump Doug Burgum wife comment: ఎంతవారుగాని.. వేదాతులైన గాని.. వాలు చూపు సోకగానే పడిపోదురోయ్.. కైపులో.. ఈ పాటకు తగ్గట్టుగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాల మీద పెత్తనం సాగించడానికి ట్రంప్ పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సుంకాలు విధిస్తున్నాడు. అంతటితో ఆగకుండా, యుద్ధాలు కూడా చేస్తున్నాడు. పలు దేశాల అధినేతలపై ఆగ్రహపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు.
ట్రంప్ ఒక వ్యాపారి. అంతకుమించిన అమెరికా పెత్తందారి. ఇప్పటివరకు ఈ విషయాలు మాత్రమే మనకు తెలుసు. పైగా అతడు అవసరానికి తగ్గట్టుగానే నడుచుకునే వ్యక్తి. అవసరం తీరిపోతే మొహమాటం లేకుండా బయటకు గెంటివేసే వ్యక్తిత్వం అతనికి ఉంటుంది. అందువల్లే అతడిని చంచలమైన వ్యక్తి అని పిలుస్తుంటారు. వివాదాస్పదమైన నిర్ణయాలు మాత్రమే కాదు.. వివాదాస్పదమైన సంబంధాల విషయంలో కూడా ట్రంప్ ది అందె వేసిన చేయి.
ట్రంప్ తాజాగా ఎప్ స్టీన్ ఫైల్స్ ద్వారా అంతర్జాతీయ మీడియాలో ట్రంప్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వీటిని మర్చిపోకముందే ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ట్రంప్ ఇటీవల ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చాడు. అయితే అతడికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చానో ట్రంప్ బయట పెట్టాడు. అది కూడా బహిరంగంగానే వ్యక్తం చేశాడు.
అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గం ను ట్రంప్ ఇటీవల నియమించాడు. అతని నియామకం వెనక కీలకమైన కారణం ఉందని ట్రంప్ చెప్పాడు. బర్గం భార్య కేథరిన్ అత్యంత గ్లామర్ గా ఉంటుందని.. ఆమె అందాన్ని చూసి బర్గం కు ఆ పదవి ఇచ్చినట్టు ట్రంప్ పేర్కొన్నాడు. మత్తు పదార్థాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు వెల్లడించడానికి ట్రంప్ ఒక అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో బర్గం కు ఎందుకు మంత్రి పదవి ఇచ్చానో ట్రంప్ వెల్లడించాడు.
కేథరిన్ ఇటీవల గుర్రపు స్వారీ చేసింది. ఆమె స్వారీ చేస్తుండగా ట్రంప్ చూశాడు. ఆ తర్వాత ఆమె గురించి కనుక్కున్నాడు. సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాతే ఆమె భర్తకు పదవి ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించుకున్నాడు. ట్రంప్ కేథరిన్ గురించి చెబుతున్నప్పుడు బర్గం కూడా అక్కడే ఉండడం విశేషం. మరోవైపు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. ముసలోడైనా సరే ట్రంప్ మహా రసికుడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.