spot_img
Homeఅంతర్జాతీయంTrump Iran War Update: యుద్ధం ఆగలేదు.. ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి..

Trump Iran War Update: యుద్ధం ఆగలేదు.. ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి..

Trump Iran War Update: ఇరాన్‌పై ఐదు రోజులు దాడులు ఆపేస్తున్నాం.. రెండు రోజులుగా జరుపుతున్న చర్చలతో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. అందుకే దాడులు ఆపేయాలని నిర్ణయించాం. ఐదు రోజుల తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటాం అని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ట్రూత్‌లో సోమవారం పోస్టు చేశారు. దీంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. క్రూడ్‌ ఆయిల్‌ధరలు పతనమయ్యాయి. అయితే ట్రంప్‌ మాటల అర్థాలు వేరే అని అమెరికా సైనికాధి ప్రకటించారు. దాడులు కొనసాగిస్తామని తెలిపారు. ఇరాన్‌లోని ఖార్గ్‌ ద్వీపం వంటి కీలక ప్రాంతాల్లో బాంబు, మిస్సైల్‌ దాడులు చేస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఐఆర్‌జీసీ కార్యాలయాలు, బాలిస్టిక్‌ క్షిపణి కేంద్రాలు, యుద్ధ విమానాలు, ట్రక్కులు పూర్తిగా ధ్వంసమయ్యాయని వీడియో విడుదల చేసింది.

వీడియో ఆధారాలు..
సోషల్‌ మీడియాలో విడుదల చేసిన ఫుటేజ్‌లో ఇరాన్‌ విమానాలు, నౌకలు, ఆయుధ భవంతులపై ఖచ్చితమైన దాడులు కనిపిస్తున్నాయి. ’ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’, ’లయన్స్‌ రోర్‌’ వంటి పేర్లతో జరిగిన ఈ దాడులు ఇరాన్‌ వాయు ఆధిపత్యాన్ని బలహీనపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో కలిసి టెహ్రాన్, ఇస్ఫహాన్‌లో 30కి పైగా స్థావరాలను టార్గెట్‌ చేసింది.

ట్రంప్‌ వ్యూహాత్మక విరామం
అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలు, చమురు మౌలిక సదుపాయాలపై ఐదు రోజులు దాడులు ఆపుతున్నట్లు ప్రకటించారు. ఇది చర్చలకు మార్గం సుగమం చేస్తూ, సైనిక చర్యలను మాత్రం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో 2,500 మెరైన్స్, మూడు యుద్ధనౌకలు డిప్లాయ్‌ చేశారు.

ఈ దాడులతో ఇరాన్‌ సైనిక సామర్థ్యం గణనీయంగా తగ్గింది, అయితే అమెరికా స్థావరాలపై ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. ఏడు దేశాల్లో 200కి పైగా అమెరికన్‌ సైనికులు గాయపడ్డారు, ఆర్థిక నష్టం 800 మిలియన్‌ డాలర్లకు చేరింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version