Homeఅంతర్జాతీయంTrump Daughter Kidnapping Plot: ట్రంప్‌ కూతురిని లేపేద్దామని ఇరాన్‌ స్కెచ్‌.. వెలుగులోకి ఇరాన్ భారీ...

Trump Daughter Kidnapping Plot: ట్రంప్‌ కూతురిని లేపేద్దామని ఇరాన్‌ స్కెచ్‌.. వెలుగులోకి ఇరాన్ భారీ ఆపరేషన్‌

Trump Daughter Kidnapping Plot: అమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇరిటేషన్‌ తెప్పిస్తోంది. మళ్లీ దాడికి ట్రంప్‌ సిద్ధమవుతున్నారు. దీంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అయితే దీర్ఘకాల ఉద్రిక్తతలు ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి విస్తరించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌కు సంబంధించిన ఒక ఉగ్రవాది కుట్ర పన్నినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ నివేదికలు వెల్లడించాయి.

నిందితుడి అరెస్ట్‌..
32 ఏళ్ల మహ్మద్‌ బకెర్‌ సాద్‌ దావూద్‌ (మహమ్మద్‌ బాకర్‌ సాద్‌ దావూద్‌ అల్‌ సాది) అనే వ్యక్తిని ఇటీవల ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇతడు ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్‌ప్స్‌(ఐఆర్‌జీసీ)తో సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2020లో ఇరాన్‌ జనరల్‌ ఖాసిమ్‌ సొలేమాని హత్యకు ప్రతీకారంగా ఇవాంకాను టార్గెట్‌ చేసినట్లు విచారణలో తేలిందని సమాచారం. ఇతడు ఇవాంకా ఫ్లోరిడా నివాసం బ్లూప్రింట్‌ కూడా సేకరించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ కేసు ఇరాన్‌ మద్దతుతో నడిచే ఉగ్రవాద నెట్‌వర్క్‌లు అమెరికా నేలపై ఎలా కార్యకలాపాలు చేపడుతున్నాయనే దానిని మళ్లీ ప్రశ్నించేలా చేస్తోంది.

ఇరాన్‌–అమెరికా ఉద్రిక్తతలు..
ఖాసిమ్‌ సొలేమాని హత్య తర్వాత ఇరాన్‌ వైపు నుంచి అనేక ప్రతీకార బెదిరింపులు వచ్చాయి. ఐఆర్‌జీసీఈను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇరాన్‌ మద్దతుతో పని చేసే మిలిషియా గ్రూపులు మధ్యప్రాచ్యం నుంచి ఐరోపా, అమెరికా వరకు తమ కార్యకలాపాలను విస్తరించాయని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ తాజా కుట్రలో ఇవాంకా ట్రంప్‌ను ఎంచుకోవడం వెనుక రాజకీయ సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్‌ ఇరాన్‌పై తీసుకున్న కఠిన చర్యలకు ప్రతీకారంగా కుటుంబ సభ్యులను లక్ష్యం చేసుకోవడం ఇరాన్‌ వ్యూహంలో భాగమని విశ్లేషకులు అంటున్నారు.

భద్రతా సవాళ్లు..
ఈ ఘటన అమెరికా భద్రతా ఏజెన్సీలు, ముఖ్యంగా సీక్రెట్‌ సర్వీస్‌ ముందు కొత్త సవాళ్లను ఉంచింది. ఉన్నత స్థాయి రాజకీయ కుటుంబాల సభ్యుల భద్రతను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇరాన్‌ ఇలాంటి ప్రాక్సీ ఉగ్రవాదుల ద్వారా తన వ్యూహాలను అమలు చేయడం అంతర్జాతీయ సంబంధాల్లో మరింత ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. అమెరికా ఈ కేసును ఎలా నిర్వహిస్తుందనేది రాబోయే రోజుల్లో ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చు.

ఈ ఆరోపణలు ఇంకా కోర్టులో నిరూపణ కావాల్సి ఉంది. అయితే ఇవి ఇరాన్‌– అమెరికా మధ్య కొనసాగుతున్న రహస్య యుద్ధంలో మరో అధ్యాయాన్ని బయటపెడుతున్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా, దానిని అడ్డుకోవడం అంతర్జాతీయ సమాజం ముందున్న సవాల్‌. ఈ కేసు న్యాయవ్యవస్థ సరైన ముగింపు పొంది, భద్రతా వ్యవస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version