https://oktelugu.com/

Hurricane Milton : అమెరికా తుఫాన్‌లో చిక్కిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రయాణం వీడియో చూడాల్సిందే

అమెరికా, చైనా దేశాలను ఈ ఏడాది తుపాన్లు వణికిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆయా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రాణ నష్టం సభవిస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 10, 2024 / 10:06 AM IST

    Hurricane Milton

    Follow us on

    Hurricane Milton : అగ్రరాజ్యం అమెరికా ప్రకృతి వైపరీత్యాలతో వణికిపోతోంది. ఏడాదికాలంగా తుపాన్లు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రాణ నష్టం సభవించకున్నా.. తీవ్ర ఆస్తి నష్టం జరుగుతోంది. మరోవైపు కార్చిచ్చు.. అడవులను దహించి వేస్తోంది. మంటలు ఆర్పేందుకు భారీగా ఖర్చ చేయాల్సి వస్తోంది. తుపాన్లతోనష్టపోయిన ప్రాంతాల పునుద్ధురణ కూడా ఆగ్రరాజ్యానికి భారంగా మారుతోంది. విపత్తుల నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా.. కూడా ప్రకృతి ప్రకోపం ముందు అవేవీ పని చేయడం లేదు. తాజాగా అమెరికాలోని ప్లోరిడా హనిరేన్‌ మిల్టన్‌ ప్రభావంతో వణుకుతోంది. ఈ తుఫాన్‌లో ఓ విమానం చిక్కుకుంది. అదృష్టవశాత్తు బయటపడింది. తుపానులో చిక్కుకుని బయకు వచ్చిన విమానం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    అనుకోకుండా హరికేన్‌లోకి..
    అమెరికాలోని హనిరేన్‌ మిల్టన్‌ ప్రభావిత ప్రాంతమైన ఫ్లోరిడా ప్రాంతలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిస్‌ పిగ్గీ లాక్‌ హీడ్‌ డబ్ల్యూపీ–3 ఓరియన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ప్రమాదవశాత్తు హరికేన్‌లోకి దూసుకుపోయింది. ఈ సమయంలో విమానంలో నలుగురు పరిశోధకులు ఉన్నారు. తుపాను ధాటికి విమానం తీవ్ర కుదుపులకు గురైంది. దీంతో విమానంలోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. పరిశోధకులు తీవ్రగా శ్రమించి విమానాన్ని మరోవైపు తీసుకెళ్లడంతో హరికేన్‌ నుంచి సురక్షితంగా తప్పించుకోగలిగారు. అయితే పరిశోధకులు తమ విమానం తుపానులో చిక్కుకున్న సమయంలోని దృశ్యాలు అందులోని ఓ పరిశోధకుడు వీడియో తీశాడు. విమానంలోకి కెమెరాల్లోనూ రికార్డయ్యయి. అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.

    తుపాన్లను తట్టుకునే విమానం..
    ఇదిలా ఉంటే.. ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ స్పెషలిస్ట్‌ జోనాథన్‌ షానన్‌ మాట్లాడుతూ ‘మా డబ్ల్యూపీ–3 ఓరియన్‌ విమానం 50 ఏళ్లుగా అనేక తుపాన్లను తట్టుకుంటూ ప్రయాణిస్తుంది’ అని పేర్కొన్నారు. తమ విమానానికి అంత శక్తి ఉందని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు.

    ప్రచండ గాలులు..
    హరికేన్‌ మిల్టన్‌ ప్రభావంతో ఫ్లోరిడాలో గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయన్నారు. దీనిని ఇప్పటికే కేటగిరీ 5గా ప్రకటించిన అధికారులు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. తుపానుపై అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడుతూ వందేళ్లలో అమెరికా ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకర తుపాన్లలో ఇదీ ఒకటని పేర్కొన్నారు.