Sunita Williams : వారం రోజుల పర్యటన కోసం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐదు నెలల క్రితం అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లారు. బోయింగ్ సంస్థ తయారు చేసి స్టార్ లైనర్ నౌకలు వీరు వెళ్లారు. అయితే అక్కడ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోయారు. ఐదు నెలలు గడిచింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారిని భూమిపైకి తీసుకువస్తామని అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. అంతరిక్షంలోకి వెళ్లినవారు అక్కడ పౌడర్ రూపంలో ఉన్న పాలు, పిజ్జా, రొయ్యల కాక్టెయిల్స రోస్ట్ చికెన్, ట్యూనా తింటారు. కొన్ని ఆహారాలు ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటారు.
ఏం తింటున్నారు..
ఇక ఐదు నెలల క్రితం అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లిన పరిశోధకులు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. మరి ఈ ఇద్దరు అక్కడ ఏం తింటున్నారు. ఎలా బతుకుతున్నారన్న సందేహాలు చాలా మందికి వస్తున్నాయి. ఐఎస్ఎస్లో ఆహారం ఎలా లభిస్తుందో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల నాసా విడుదల చేసిన ఫొటోల్లో సునీత విలియమ్స్ సన్నబడ్డట్లు కనిపించారు. దీంతో వారు ఏం తింటున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందికి పెరిగింది. అయితే వీరు ఐఎస్ఎస్లో పౌడర్ రూపంలో ఉన్న పాలు, పిజ్జా, రొయ్యల కాక్టెయిల్స్, చికెన్ రోస్ట్, ట్యూనా వంటి వివిధ రకాల ఆహారం తింటున్నారు. ఈ విషయాన్ని స్టార్ లైనర్ మిషన్ నిపుణుడు తెలిపారు. ఆహారంతోపాటు తాజా పండ్లు, కూరగాయలు తక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆహార పదార్థాలను ఐఎస్ఎస్కు చేరవేస్తుంటారని చెప్పారు. పండ్లు, కూరగాయలను ప్యాకింగ్ చేస్తారని పేర్కొన్నారు. అంతరిక్షంలో ఆహార పదార్ధాలు చాలా వరకు ఎండిన, గడ్డకట్టిన స్థితిలో ఉంటాయని తెలిపారు.
అవసరాలకు అనుగుణంగా..
ఐఎప్ఎస్లో లభించే ఆహార పదార్థాలను ప్రతీ వ్యోమగామి రోజువారీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేస్తారు. ఫుడ్ వార్మర్‌ని ఉపయోగించి వేడిచేసుకుంటారు. మాంసం, గుడ్లు వంటివి భూమిపైనే వండుతారు. అంతరిక్షంలో మళ్లీ వేడి చేసుకుని తింటారు. డీహైడ్రేటెడ్ సూప్‌లు, క్యాసరోల్స్‌లకు అవసరమైన నీటిని స్పేస్ స్టేషన్లో ఉండే 530 గాలన్ల మంచి నీటి ట్యాంకు నుంచి పొందుతారు. అయస్కాంతీకరించిన మెటల్ ట్రేలలో సునీతా విలియమ్స్, విల్మోర్ ఆహారాన్ని తింటున్నారు. ఇక నాసాకు చెందిన వైద్యులు ఎప్పటికప్పుడు తగినంత కేలరీలు లభించే ఫుడ్ తింటున్నారో లేదో నిర్ధారిస్తున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: This is the food sunita williams has been eating for five months in space
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com