Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇన్నాళ్లు శత్రువులకు మాత్రమే నచ్చలేదు. కానీ ఇప్పుడు సొంత దేశంలోని వారికి కూడా ఇష్టం లేదని తెలుస్తోంది. ఆసియా దేశాలకు చమురు సరఫరా కోసం కీలకంగా ఉన్న హర్మోజ్ జల సంధిని దిగ్బంధం చేస్తున్నట్లు ఇటీవల ట్రంపు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పై కొన్ని మిత్ర దేశాలతో సహా అమెరికా సైన్యం కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు సైన్యం ఎందుకు వ్యతిరేకిస్తుంది? ట్రంప్ హర్మోజ్ దిగ్బంధంపై మిత్ర దేశాలు ఏమంటున్నాయి?
ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య రగిలిన చిచ్చుతో అమెరికా ఎంట్రీ ఇచ్చి యుద్ధ వాతావరణన్ని నెలకొల్పింది. ఇప్పటికే ఇరాన్ పై ఎన్నో రకాల దాడులు చేసిన అమెరికా ఆ తర్వాత ఆ దేశ సుప్రీం లీడర్ ను అంతం చేసిన విషయం తెలిసిందే. అయితే యురేనియం పై ఆధిపత్యం తమది ఉండాలన్న అమెరికా కు ఇరాన్ వ్యతిరేకంగా నిలుస్తూ గట్టి పోరాటాన్ని చేస్తోంది. కొన్ని రోజులుగా సాగిన యుద్ధం తర్వాత ఏప్రిల్ 11న పాకిస్థాన్లోని ఇస్లామాబాదులో ఇరాన్, అమెరికా నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆసియా దేశాలకు కీలక రవాణా మార్గం అయిన హర్మోజ్ జల సంధిని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఇప్పటికే ఇరాన్ ఈ జలసంధి పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కొన్ని దేశాలకు చెందిన నౌకలను వెళ్లకుండా ఆపుతోంది. ఆయా దేశాలు టోల్ ఫీజు కడితేనే విడిచిపెడుతోంది. అయితే భారత్ తో సహా కొన్ని మిత్ర దేశాలకు ఇరాన్ ఎలాంటి ఫీజు లేకుండా నౌకలను విడిచిపెడుతోంది. ఈ సమయంలో ట్రంప్ ఎలాంటి నౌకలు వెళ్లకుండా చేస్తామని.. పూర్తిగా దిగ్బంధం చేసినట్లు చెప్పాడు. అయితే ఈ నిర్ణయం పై సొంత దేశ సైనిక అధికారులు వ్యతిరేకత తెలుపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒక సమస్య తొలగి పోవాలంటే పరిష్కారం గురించి ఆలోచించాలి. కానీ ట్రంప్ కొత్త సమస్యను సృష్టించడంతో ప్రపంచం అల్లకల్లోలంగా మారబోతుంది. ఇప్పటికే ఇరాన్ ను అమెరికా ఎన్నో రకాలుగా దాడులు చేసి ముప్పు తిప్పలు పెడుతున్నా.. ఎలాంటి భయాందోళన చెందడం లేదు. కానీ ఇప్పుడు ట్రంపు తీసుకునే నిర్ణయంతో మిత్రదేశాలు కూడా వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
కొన్ని వర్గాల వారి వస్తున్న సమాచారం మేరకు గల్ఫ్ దేశాలైన కువైట్ వంటివి అమెరికాకు మిత్ర దేశంగా ఉన్నా కూడా.. ట్రంప్ తీసుకునే నిర్ణయాలపై వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నేరుగా ఇరాన్తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. ఇలా అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్నవి.. నేరుగా ఇరాన్తో చర్చలు జరిపి సఫలం అయితే అప్పుడు అమెరికా ఒంటరిగా మారే అవకాశం ఉంది. మరోవైపు అమెరికాలోని డాలర్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా హర్మోజ్ జలసంధిని తాము దిగ్బంధం చేశామని చెబుతున్నా కూడా.. అమెరికన్ సైనిక బలగాలు ఇప్పటివరకు ఈ జల సంధి కి చేరుకోలేదన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్తో రెండో విడత చర్చలు ఉన్నట్లు ట్రంపు ప్రకటించడంతో.. అమెరికన్ సైనికులకు అయోమయంగా మారినట్లు తెలుస్తోంది.
