Major twist in Osman Hadi case: బంగ్లాదేశ్ విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్యలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైసల్ కరీమ్ మసూద్ దుబాయ్‌లో ఉన్నానని సెల్ఫీ వీడియో ద్వారా ప్రకటించాడు. తనపై ఆరోపణలు తప్పుడు అని, హత్యకు పాల్పండగా లేదని స్పష్టం చేశాడు. ఈ వీడియో కేసులో కీలక మలుపుగా మారింది.
భారత ఆరోపణలు..
ఢాకా పోలీసులు హాదీ హత్య కేసు నిందితులు భారత్‌కు పారిపోయారని ఆరోపించింది. బీఎస్‌ఎఫ్ ఈ ఆరోపణలను ఖండించింది. సరిహద్దు పరిశీలనల్లో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ ఖండన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే సంకేతంగా కనిపిస్తోంది.
తాజా వీడియోపై యూనస్ ప్రభుత్వం స్పందన..
దుబాయ్‌లో హంతకుడు ఉన్నట్లు తాజా సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడంతో యూనస్ ప్రభుత్వంపై కొత్త ఒత్తిడి పెరిగింది. కేసు దర్యాప్తులో అవకాశాలు తగ్గడం, ప్రజల్లో అసంతృప్తి పెరగడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. దుబాయ్ అధికారులతో సంప్రదింపులు, అంతర్జాతీయ సహకారం కోరుకోవచ్చు.
హాదీ హత్య విద్యార్థి ఉద్యమానికి మలుపు తిప్పింది. నిందితుడి దుబాయ్ ధ్రువీకరణ కేసు దిశను మార్చవచ్చు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో మతపరమైన శక్తులు, విదేశీ ప్రభావాలు పెరగడం ఈ కేసు వెనుక దాగి ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.