America : అగ్రరాజ్యం అమెరికా ప్రజలు, ఉద్యోగులను రెండు రోజులుగా టెన్షన్ పెడుతున్న షట్‌డౌన్ గండం తొలగిపోయింది. కాబోయే అధ్యక్షుడి తీరుతో రెండు రోజులు అక్కడి ప్రజలు ఆందోళన చెందారు. కీలక నిధుల బిల్లును తిరస్కరించాలని ట్రంప్ పిలుపు నివ్వడంతో నిధులు రాలేని పరిస్థితి. కనీసం చర్చ కూడా జరగలేదు. దీంతో అమెరికా వ్యాప్తంగా ఆందోళనకర పరస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ట్రంప్ బిల్లులో కొన్ని మార్పులు సూచించారు. ఈమేరకు సవరణలు చేసి కొత్తగా ప్రవేశపెట్టిన కీలక నిధుల బిల్లుకు ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదం తెలిపాయి. 2018–19లో కూడా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కీలక నిధుల బిల్లుకు ఆమోదం లభించలేదు. దీంతో 35 రోజులపాటు అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. తాజాగా మళ్లీ ట్రంప్ కారణంగానే శుక్రవారం ఆమోదం పొందాల్సిన బిల్లు ఆగిపోయింది. చివరకు సవరణలు చేయడంతో అర్ధరాత్రి స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అనంతరం బిల్లును సెనెట్‌కు పంపించారు. అక్కడ కూడా ఆమోదం లభిస్తే షట్‌డౌన్ గండం తొలగిపోతుంది.
వ్యతిరేకించిన రిపబ్లికన్లు..
ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాల చెల్లింపులకు అవసరమైన నిధుల కోసం బైడెన్ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. ట్రంప్ దానిని మొదట తిరస్కరిచంఆరు. ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతోపాటు ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు బిల్లులో రెండేళ్లు రుణాలపై పరిమితి ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ బిల్లు పెట్టారు. ఈ సభ 235–174 ఓట్ల తేడాతో తిరస్కరించింది. రిపబ్లిక్ పార్టీ, డెమొక్రాట్లతో కలిపి 38 మంది బిల్లును వ్యతిరేకించారు.
అధికార మార్పిడికి అంతరాయం..
కీలక నిధుల బిల్లుకు ఆమోదం లభించకపోవడంపై వైట్‌హౌస్ కీలక వ్యాక్యలు చేసింది. షట్‌డౌన్ వస్తే అధికార బదిలీకి అంతరాయం కలుగుతుందని హెచ్చరించింది. రిపబ్లికన్ల నుంచి వ్యతిరేకత రావడంతో ట్రంప్ వెనక్కి తగ్గారు. దీంతో బిల్లులో మార్పులు చేసి ట్రంప్ డిమాండ్లను తొలగించి ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు, విపత్తు సహకారం వంటి అంశాలతో 118 పేజీల కొత్త బిల్లును స్పీకర్ ప్రవేశపెట్టారు. దీనిని 366–34 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ ఆమోదించింది. మెజారిటీ రిపబ్లికన్లు కొత్త బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. సెనెట్‌లో డెమొక్రాట్లు అధికంగా ఉన్నారు. దీంతో అక్కడ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే.
ట్రంప్ పాలనలో షట్‌డౌన్..
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2018–19 మధ్య దాదాపు 35 రోజులపాటు ప్రభుత్వం మూతపడింది. దేశ చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌డౌన్. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని భావించారు. కానీ ఆఖరి నిమిషంలో షట్‌డౌన్ ముప్పు తప్పింది.